రష్యాతో కాళ్లబేరానికి ట్రంప్.. డీజిల్ కొనుగోలుకు అమెరికా సిద్ధమని ప్రకటన.. ఆంక్షలు ఎత్తివేత..

Trump-Putin Deal: అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్రరూపం దాల్చుతున్న డీజిల్ సంక్షోభాన్ని కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దశాబ్దాలుగా శత్రుదేశంగా ఉన్న రష్యాతో సంబంధాలలో అనూహ్య మార్పుకు శ్రీకారం చుడుతూ.. ప్రపంచ మార్కెట్‌కు డీజిల్ సరఫరాను పెంచడానికి రష్యా అంగీకరించిందని ట్రంప్ శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

ఈ క్రమంలో పెరుగుతున్న ఇంధన ధరలను నియంత్రించి.. నవంబర్‌లో జరగనున్న కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఊరటనిచ్చేందుకు రష్యా డీజిల్ దిగుమతులపై ఉన్న కఠినమైన ఆంక్షలను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా సడలించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7వ తేదీ వరకు రష్యా నుండి డీజిల్ దిగుమతి చేసుకునేందుకు అమెరికా ట్రెజరీ శాఖ ప్రత్యేక లైసెన్సులను జారీ చేసింది.

Trump Russian diesel US lifts Russian diesel sanctions Russian diesel imports Trump Putin deal US fuel prices diesel price surge Russia energy exports global diesel market US energy policy Iran war impact fuel supply crisis Russian fuel sanctions global oil market diesel imports to America

ఈ ఒప్పందంలో భాగంగా రష్యా వెంటనే అమెరికా, ప్రపంచ మార్కెట్లకు 300,000 మెట్రిక్ టన్నులకు పైగా డీజిల్‌ను (సుమారు 2.25 మిలియన్ బ్యారెళ్లు) సరఫరా చేస్తుందని ట్రంప్ వెల్లడించారు. అంతేకాకుండా నవంబర్‌లో మరో 500,000 మెట్రిక్ టన్నులు, ఆ తర్వాత అదనంగా మరో 1 మిలియన్ టన్నుల వరకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అయితే, ఉక్రెయిన్ దాడుల వల్ల ఇప్పటికే దెబ్బతిన్న రష్యా రిఫైనరీల ఉత్పత్తి సామర్థ్యాన్ని బట్టే భవిష్యత్ సరఫరాలు ఆధారపడి ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Also Read

ఫిబ్రవరి 28న యూఎస్, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించినప్పటి నుండి డీజిల్ ధరలు ఏకంగా 70 శాతానికి పైగా ఎగబాకాయి. గురువారం నాటికి అమెరికాలో డీజిల్ సగటు ధర గ్యాలన్‌కు $6.28కి చేరింది. రష్యా సరఫరాల ప్రకటన వెలువడిన వెంటనే యూఎస్ డీజిల్ ఫ్యూచర్స్ దాదాపు 5 శాతం తగ్గి గ్యాలన్‌కు $4.64కు పడిపోయినప్పటికీ.. ఇది దీర్ఘకాలిక ఉపశమనం ఇస్తుందా లేదా అనేదానిపై నిపుణుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం దేశీయంగా, అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. రష్యాపై ఆంక్షలను సడలించడం ద్వారా వచ్చే ఇంధన ఆదాయం ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధానికి మరింత ఊతమిస్తుందని ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తీవ్రంగా విమర్శించారు.

రష్యాకు ఇటువంటి రాయితీలు శాంతి స్థాపనకు ఎట్టిపరిస్థితుల్లోనూ సహకరించవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలోనూ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు డాన్ బేకన్‌తో పాటు పలువురు చట్టసభ సభ్యులు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. రష్యా యుద్ధ యంత్రంపై ఉక్కుపాదం మోపాల్సిన ఈ సమయంలో ఆంక్షలు సడలించడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు.

మరోవైపు ఇంధన ధరలను అదుపు చేయడానికి అమెరికా ప్రభుత్వం దేశీయ ఉత్పత్తిని పెంచే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలిస్తోంది. ఇంధన రక్షణ ఉత్పత్తి చట్టాన్ని ఉపయోగించడం లేదా రాష్ట్ర స్థాయి నిబంధనలను అధిగమించడం వంటి చర్యలపై ట్రంప్ శాఖలు దృష్టి సారించవచ్చు. అయితే కొత్త రిఫైనరీల నిర్మాణం కంటే ఉన్న వాటి సామర్థ్యాన్ని పెంచడమే మేలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. తాత్కాలికంగా ఈ ఒప్పందం మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చినా, ప్రపంచ ఇంధన సంక్షోభం నివారణకు సమగ్ర శాశ్వత చర్యలు అవసరమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+