అమెరికా కంపెనీలు ప్రతి మూడు నెలలకోసారి క్వార్టర్‌కి తమ ఆర్థిక ఫలితాలు ప్రకటించాల్సిన రూల్ రద్దు చేయాలని ట్రంప్ తాజాగా డిమాండ్ చేశారు. ట్రంప్ మాట్లాడుతూ ఇకపై కంపెనీలు ఆరు నెలలకోసారి సెమీ-యాన్యువల్ రిపోర్ట్ ఇస్తే చాలు. ఇలా చేస్తే ఖర్చులు తగ్గుతాయి, మేనేజర్లు నిజమైన బిజినెస్‌పై ఫోకస్ పెట్టగలరు అని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం లో పోస్ట్ చేశారు.

మూడు నెలలకో రిపోర్ట్?
ప్రస్తుతం అమెరికాలో లిస్టెడ్ కంపెనీలు ప్రతి 90 రోజులకు ఒకసారి ఫైనాన్షియల్ ఫలితాలు ప్రకటించాలి. దీంతో ఇన్వెస్టర్లకు రెగ్యులర్ అప్‌డేట్స్ దొరుకుతున్నా, కంపెనీలపై మాత్రం భారీ ఒత్తిడి పడుతోంది. ట్రంప్ అభిప్రాయం ప్రకారం, ఈ రూల్ తీసేస్తే కంపెనీలు షార్ట్‌టర్మ్ ఫలితాల కోసం పరుగులు పెట్టకుండా, లాంగ్‌టర్మ్ గ్రోత్‌పై దృష్టి పెట్టగలవు. యు.ఎస్. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) కూడా ట్రంప్ ప్రతిపాదనను ఇప్పుడు సీరియస్‌గా పరిగణనలోకి తీసుకుంటోంది.
2018లో కూడా SEC ఈ మార్పుపై ప్రజల అభిప్రాయాలు సేకరించింది కానీ అప్పట్లో మార్పు చేయలేదు. ఈసారి మాత్రం "ట్రంప్ అభ్యర్థన మేరకు ఈ ప్రతిపాదనను ప్రాధాన్యంగా ముందుకు తీసుకెళ్తున్నాం" అని SEC ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఇన్వెస్టర్లలో ఈ ప్రతిపాదనపై మిశ్రమ అభిప్రాయాలు కనిపిస్తున్నాయి. కొందరు చెబుతున్నది ఎమిటంటే మూడు నెలలకు ఒకసారి ఫైనాన్షియల్ అప్‌డేట్ ఇవ్వకపోతే మార్కెట్లు అస్థిరతకు గురవుతాయని, పారదర్శకత కూడా తగ్గిపోతుందని. మరోవైపు, కొంతమంది మాత్రం ఈ మార్పును స్వాగతిస్తున్నారు. ఉదాహరణకు, అడెనా ఫ్రైడ్‌మాన్, నాస్‌డాక్ కంపెనీ CEO మాట్లాడుతూ, "తరచుగా రిపోర్ట్ ఇస్తే లిస్టింగ్ ఖర్చులు, ఒత్తిడి తగ్గుతాయి" అన్నారు. ప్రస్తుతం S&P 500 స్టాక్స్ వచ్చే 12 నెలల లాభాలపై 24.3 రెట్లు విలువతో ట్రేడవుతుంటే, STOXX 600 యూరప్ ఇండెక్స్ మాత్రం 15.28 రెట్లు మాత్రమే ఉందని LSEG డేటా చెబుతోంది. అందుకే విశ్లేషకులు చెబుతున్నట్టు, కఠినమైన రిపోర్టింగ్ విధానాలు కూడా అమెరికా స్టాక్స్‌కి ఈ ప్రీమియం వాల్యూయేషన్ రావడానికి ఒక కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.
ఎం. టాడ్ హెండర్సన్, చికాగో విశ్వవిద్యాలయం లా ప్రొఫెసర్ ఇలా అంటున్నారు "SEC రూల్ మార్చినా కూడా చాలా కంపెనీలు ఇన్వెస్టర్ల కోసమే క్వార్టర్ రిపోర్ట్స్ కొనసాగిస్తాయి. షార్ట్‌టర్మ్ ఆలోచన కొన్ని కంపెనీల్లో మాత్రమే ఉంది." మరికొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం మార్కెట్ అలవాట్ల కారణంగా ఎక్కువ కంపెనీలు మళ్లీ మూడు నెలలకు ఒకసారి అప్‌డేట్స్ ఇస్తూనే ఉంటాయి.
1970 వరకు అమెరికా కంపెనీలు ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఫలితాలు ప్రకటించేవి. తరువాతే క్వార్టర్ రిపోర్ట్స్ తప్పనిసరి అయ్యాయి. 2018లో వారెన్ బఫెట్, జేమీ డిమోన్ లాంటి దిగ్గజులు కూడా క్వార్టర్ ఫోకస్ వల్ల షార్ట్‌టర్మ్ ఆలోచన పెరిగి, అమెరికా ఎకానమీకి నష్టం జరుగుతోంది" అన్నారు. JP మోర్గాన్ చేజ్, బెర్క్‌షైర్ హాత్వే లాంటి పెద్ద సంస్థలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి.
ఇన్వెస్టర్లు సమాచారం కోసం ఎక్కువసేపు వేచి చూడాల్సిన పరిస్థితి రాకూడదు" అంటున్నవారు కూడా ఉన్నారు. ఉదాహరణకు, కౌన్సిల్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 2019లో SEC కి ఇచ్చిన నివేదికలో, "ప్రస్తుతం ఉన్న త్రైమాసిక రిపోర్టింగ్ విధానం వల్ల మేము కంపెనీల ప్రోగ్రెస్‌పై సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం" అని పేర్కొంది.
ట్రంప్ ప్రతిపాదన కంపెనీలకు ఊరట ఇస్తుందేమో కానీ, ఇన్వెస్టర్లకు పారదర్శకత తగ్గుతుందన్న భయం ఉంది. ఇది జరిగితే అమెరికా మార్కెట్ వ్యవస్థలో పెద్ద మార్పే అవుతుంది. ఇప్పుడు చూడాల్సిందల్లా SEC నిజంగా రూల్స్ మార్చుతుందా? లేక పాత వ్యవస్థనే కొనసాగిస్తుందా?
More From GoodReturns

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications