Gold News: దాదాపుగా రెండు వారాల నుంచి నిరంతరాయంగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో భారతీయ పసిడి ప్రియుల్లో ఆందోళన నెలకొంది. ఇదే పరిస్థితి ఇంకెన్ని రోజులు కొనసాగుతుందనే ఆందోళనలు వారిలో ఉన్నాయి. అయితే అకస్మాత్తుగా ధరల పెరుగుదలకు అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అసలు ప్రపంచ వ్యాప్తంగా పసిడి ధరల పెరుగుదలకు ముఖ్య కారణం అమెరికాలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ప్రభుత్వం ఎకనమిక్ పాలసీలపై అంచనాలు పసిడి ధరలను నిరంతరాయంగా పెంచుతున్నాయి. దీనికి తోడు అమెరికా ఉద్యోగాల గణాంకాలు కూడా దీనికి మరో కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి ఈ కారణాల వల్ల అమెరికా బాండ్ ఈల్డ్స్, డాలర్ బలంగా కొనసాగుతున్నప్పటికీ గోల్డ్ ధరలు దూకుగా ముందుకు సాగుతూనే ఉన్నాయి. డిసెంబరులో పెరిగిన ఉద్యోగాలతో నిరుద్యోగిత రేటు 4.1 శాతానికి తగ్గిందని వెల్లడైంది.

జాబ్ డేటా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వేగంగా వడ్డీ రేట్ల తగ్గింపుకు అడ్డంకిగా నిలుస్తుందని తెలుస్తోంది. నిపుణుల అంచనా ప్రకారం 2025 ఏడాది మధ్యలో ఒక్కసారి మాత్రమే ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించవచ్చని వారు భావిస్తున్నారు. ఈ క్రమంలో 10 ఏళ్ల యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 4.745 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. అలాగే బలమైన లేబర్ మార్కెట్ డేటా డాలర్ విలువను బలంగా ముందుకు సాగేందుకు దోహదపడుతోందని నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి బలమైన లేబర్ మార్కెట్ డేటా వల్ల పసిడి ధరలు తగ్గుదలను చూసిన సంగతి తెలిసిందే. కానీ కొద్ది రోజులకే ధరలు తిరిగి పుంజుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాలపై పన్నులు, టారిఫ్ లు, భారీగా డిపోర్టేషన్ వంటి కారణాలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయనే ఆందోళనలు ఫెడ్ మానిటరీ పాలసీ నిర్ణయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నాయి. డాలర్ పెరిగినప్పుడు తగ్గాల్సిన గోల్డ్ పైన కారణాల వల్ల భిన్నంగా పెరుగుదలను చూస్తోందని వారు చెబుతున్నారు. రిస్క్ తీసుకోని ఇన్వెస్టర్ల నుంచి పసిడి డిమాండ్ పెరగటం కూడా దీనికి కారణంగా తెలుస్తోంది.
ట్రంప్ రాక తర్వాత గోల్డ్ పరిస్థితి ఏంటి?
ట్రంప్ విధానాల రాబోయే అమలు మార్కెట్లపై పెద్దగా దూసుకుపోతుంది. నిర్ణయాల కారణంగా.. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగితే బంగారం తీవ్ర ఆందోళన నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఈ పరిస్థితులు రిటైల్ వినియోగదారులకు ఆందోళనకరమైన అంశంగా ఉంది. అయితే పెట్టుబడులు పెట్టేవారికి గోల్డ్ ఈ కాలంలో కొంత లాభాలను అందించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
నేటి ధరలు..
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7946 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7946 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications