Trump on Gaza: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ప్రధానంగా ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలని ట్రంప్ చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధానితో దీనిపై చర్చలు కూడా జరిపారు.
తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో గాజా స్ట్రిప్ అమెరికాలో భాగంగా మారాలనే తన ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు. ఇదే క్రమంలో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందంపై కీలక హెచ్చరికలు జారీ చేశారు. గాజాలో హమాస్ ఆధీనంలో ఉన్న యుద్ధ ఖైదీలను శనివారం మధ్యాహ్నం నాటికి విడిచిపెట్టకపోతే కాల్పుల విరమణ ఒప్పందం రద్దవుతుందని పేర్కొన్నారు. ఇదే జరిగితే హమాస్ కి ట్రంప్ చేతిలో పెద్ద చావుదెబ్బ తగలటం తప్పదని తెలుస్తోంది. హమాస్ ఖైదీల విడుదలపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా ట్రంప్ పేర్కొన్నారు.

కాల్పుల విరమణపై అంతిమ నిర్ణయం తీసుకునే హక్కు ఇజ్రాయెల్ చేతిలోనే ఉంటుందని కూడా ట్రంప్ ఈ సందర్బంగా వెల్లడించారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించిందంటూ తమ నిర్భందంలో ఉన్న ఇజ్రాయెలీలను హమాస్ విడుదల చేయటం ఆపేసిన తర్వాత ట్రంప్ హెచ్చరికలు రావటం గమనార్హం. అలాగే దీనికి కొన్ని రోజుల ముందు కూడా ట్రంప్ గాజాను అమెరికా ఆధీనంలోకి తీసుకునే విషయంపై కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ గాజా ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు ట్రంప్ చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీశాయి.
గాజా స్ట్రిప్ ప్రాంతాన్ని అమెరికా సేనలు నియంత్రించటానికి ట్రంప్ ప్రతిపాదన కూడా పెట్టారు. మధ్యప్రాశ్యంలో గాజా ప్రాంతాన్ని అమెరికా సంపన్న ప్రాంతంగా అభివృద్ధి చేస్తుందని ట్రంప్ ఈ సందర్భంగా కామెంట్ చేశారు. ట్రంప్ తాజా ప్రతిపాదనపై ఇజ్రాయెల్ సానుకూలంగా ఉండగా అరబ్ దేశాలు మాత్రం ముక్త కంఠంతో దీనిని వ్యతిరేకించాయి. ఇక్కడి పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ ప్రతిపాదించినప్పటికీ దానికి ఈజిప్ట్, జోర్డాన్ వంటి దేశాలు నిరాకరిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.
వాస్తవానికి ప్రస్తుతం గాజాలోని ప్రాంతాలు యుద్ధం తర్వాత ప్రజలు నివసించటానికి అనువుగా లేవని.. అందుకే తాము అక్కడి పాడైన నిర్మాణాలను కూల్చి వాటి స్థానంలో అందమైన ప్రాంతాలుగా తీర్చుదిద్దుతామని ట్రంప్ పేర్కొన్నారు. 20 లక్షల మందినికి అందమైన, సురక్షితమైన కమ్యూనిటీస్ నిర్మిస్తామని అన్నారు. అందుకోసం ముందుగా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటామని, భవిష్యత్తులో అందమైన ప్రాంతంగా దీనిని తీర్చిదిద్దుతామని ట్రంప్ పేర్కొన్నారు. శరణార్థులను తీసుకుంటే జోర్డాన్, ఈజిప్టులకు భారీ సాయం కూడా అందిస్తామని ప్రకటించారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications