అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఒకటే చర్చ.. తర్వాతి 'ఫెడ్ రిజర్వ్' బాస్ ఎవరు? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనదైన శైలిలో సస్పెన్స్ ను పెంచుతూ, కొత్త ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ పేరును ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, మాజీ ఫెడ్ గవర్నర్ కేవిన్ వార్ష్ (Kevin Warsh) పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రాగానే అటు స్టాక్ మార్కెట్లు, ఇటు బాండ్ మార్కెట్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి.

ఎవరీ కేవిన్ వార్ష్? ట్రంప్ ఎందుకు మొగ్గు చూపుతున్నారు?
కేవిన్ వార్ష్ ఆర్థిక రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. 2006 నుండి 2011 వరకు ఆయన ఫెడరల్ రిజర్వ్ బోర్డులో గవర్నర్ గా పనిచేశారు. విశేషమేమిటంటే కేవలం 35 ఏళ్ల వయసులోనే ఈ పదవిని చేపట్టి ఫెడ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు.
ట్రంప్ గతంలోనే జెరోమ్ పావెల్ స్థానంలో ఈయన్ని నియమించాలని అనుకున్నారు, కానీ 2017లో అది కుదరలేదు. ఇప్పుడు మరోసారి వార్ష్ వైపు ట్రంప్ (Trump) మొగ్గు చూపడం వెనుక బలమైన కారణం ఉంది. సాధారణంగా వార్ష్ ను 'ఇన్‌ఫ్లేషన్ హాక్' (ద్రవ్యోల్బణంపై కఠినంగా ఉండేవారు) అని పిలుస్తారు, కానీ ఇటీవల ఆయన తన పంథా మార్చుకున్నారు. వడ్డీ రేట్లను తగ్గించాలన్న ట్రంప్ ఆలోచనలతో ఆయన ఏకీభవిస్తుండటమే దీనికి ప్రధాన కారణం.
మార్కెట్ల స్పందన ఎలా ఉంది?
వార్ష్ పేరు వినిపించగానే మార్కెట్లు కాస్త ఆందోళనకు గురయ్యాయి. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ పెరిగాయి, అలాగే డాలర్ విలువ పుంజుకుంది. అదే సమయంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇన్వెస్టర్లు ఇప్పుడు ట్రంప్ అధికారిక ప్రకటన కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
రేట్ల తగ్గింపుపై ట్రంప్ ఒత్తిడి
ప్రస్తుత ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీ రేట్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే ట్రంప్ (Trump) మాత్రం వడ్డీ రేట్లను వేగంగా తగ్గించాలని కోరుకుంటున్నారు. దీనివల్ల సామాన్యులకు రుణాలు చౌకగా లభిస్తాయని, తద్వారా ఆర్థిక వృద్ధి పెరుగుతుందని ఆయన నమ్మకం. వార్ష్ గనుక పగ్గాలు చేపడితే ట్రంప్ ఆశించిన విధంగా వడ్డీ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
రేసులో ఉన్న ఇతర అభ్యర్థులు
కేవలం వార్ష్ మాత్రమే కాదు, ఈ రేసులో మరికొంత మంది దిగ్గజాలు కూడా ఉన్నారు:
- కెవిన్ హస్సెట్: వైట్ హౌస్ నేషనల్ ఎకనామిక్ కౌన్సిల్ డైరెక్టర్.
- క్రిస్టోఫర్ వాలర్: ప్రస్తుతం ఫెడ్ గవర్నర్‌గా ఉన్నారు.
- రిక్ రీడర్: ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ 'బ్లాక్‌రాక్' ఎగ్జిక్యూటివ్.
అయితే, గురువారం వైట్ హౌస్‌లో కేవిన్ వార్ష్ నేరుగా ట్రంప్‌ను కలవడంతో, ఆయనకే పదవి దక్కే అవకాశాలు 90% వరకు ఉన్నాయని ప్రిడిక్షన్ మార్కెట్లు చెబుతున్నాయి.
ఏదేమైనా ఫెడ్ ఛైర్మన్ పదవి అంటే కేవలం అమెరికాకే కాదు, ప్రపంచ దేశాల మార్కెట్లపై కూడా ప్రభావం చూపే కీలక స్థానం. ట్రంప్ తీసుకోబోయే ఈ నిర్ణయం రాబోయే కాలంలో అంతర్జాతీయ వాణిజ్యం, ఇన్‌ఫ్లేషన్ , డాలర్ విలువను ఎలా మారుస్తుందో వేచి చూడాలి. శుక్రవారం ఉదయం ఈ ఉత్కంఠకు తెరపడనుంది.
More From GoodReturns

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications