తెలంగాణ అభివృద్ధి దిశగా మరో కీలక అధ్యాయం ప్రారంభమైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం ఆధ్వర్యంలోని ట్రంప్ గ్రూప్.. రాబోయే పది సంవత్సరాలలో తెలంగాణలో దాదాపు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అమెరికా వెలుపల ట్రంప్ కుటుంబం ఇప్పటివరకు చేసిన పెట్టుబడులలో ఇది అత్యంత భారీ పెట్టుబడిగా భావిస్తున్నారు. ఈ ప్రకటన వచ్చిన ఒక రోజు ముందుగానే.. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని యుఎస్ కాన్సులేట్ జనరల్ ఎదుట ఉన్న ప్రధాన రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టాలని ప్రతిపాదించడం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ రంగాలలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టాలన్న ఈ ప్రణాళికలో అత్యంత ప్రధాన భాగం మిర్‌ఖాన్‌పేట సమీపంలోని భారత్ ఫ్యూచర్ సిటీ ని చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వ అత్యంత ప్రతిష్ఠాత్మక మెగా అర్బన్ ప్రాజెక్ట్. హైదరాబాద్ నుండి రెండు గంటల ప్రయాణ దూరంలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఈ ప్రదేశం శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేల మధ్య 56 గ్రామాల సమూహాన్ని కలిగి ఉంటుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ దీనిని అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆసియాలోనే అత్యాధునిక నగరాలలో ఒకటిగా నిలవనుంది.

తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో పాల్గొన్న ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్.. ఫ్యూచర్ సిటీ, దాని పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి రూ.1 లక్ష కోట్ల వరకు పెట్టుబడి పెట్టాలన్న తమ సంకల్పాన్ని ప్రకటించారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం ప్రపంచ టెక్నాలజీ రంగంలో వేగంగా ఎదుగుతున్నదని, ఇక్కడి ప్రతిభ, ఆర్థిక వాతావరణం, పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి గమ్యస్థానమని ఆయన పేర్కొన్నారు.
భారతదేశంలో ట్రంప్ బ్రాండ్ ఇప్పటికే ట్రంప్ టవర్స్ రూపంలో ఉన్నప్పటికీ, అవి బ్రాండ్ లైసెన్సింగ్ వ్యూహంతో నడుస్తున్నాయి. ముంబై, పూణే, గురుగ్రామ్, కోల్‌కతాలో ప్రస్తుతం ట్రంప్ టవర్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. అయితే తెలంగాణలో ప్రతిపాదించిన ఈ కొత్త పెట్టుబడి ప్రత్యక్షంగా అభివృద్ధి కార్యక్రమాలలో భాగస్వామ్యమవ్వబోతోంది.
ఫ్యూచర్ సిటీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అభివృద్ధి చేయనున్న ప్రపంచ స్థాయి ఫిల్మ్ సిటీ.. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటారా ప్రాజెక్ట్, సుమారు రూ.3 వేల కోట్ల విలువైన అంతర్జాతీయ స్థాయి హోటల్ ప్రాజెక్టులు వంటి పెద్ద నిర్మాణాలు కూడా నిర్మాణం అయ్యే అవకాశముంది. ఇవ అన్నీ కలిసి ఫ్యూచర్ సిటీని ఒక మల్టీ-డైమెన్షనల్ గ్లోబల్ డెవలప్‌మెంట్ హబ్‌గా రూపొందించనున్నాయి.
ఈ భారీ పెట్టుబడి కారణంగా లక్షల కొద్దీ కొత్త ఉద్యోగ అవకాశాలు, విదేశీ డబ్బు ప్రవాహం, రియల్ ఎస్టేట్ విలువల్లో పెరుగుదల, టెక్నాలజీ, ఎంటర్టైన్‌మెంట్, టూరిజం, హాస్పిటాలిటీ రంగాలలో బలమైన విస్తరణ జరిగే అవకాశం ఉంది. తెలంగాణను ప్రపంచ స్థాయిలో పోటీ పడగలిగే పెట్టుబడి గమ్యస్థానంగా నిలబెట్టడంలో ఈ పెట్టుబడులు కీలక పాత్ర పోషించనున్నాయి.
More From GoodReturns

Telangana Budget: తెలంగాణ బడ్జెట్ 2026: సామాన్యుడికి ఊరట కలిగేనా?

యుద్దంపై ఇరాన్ కీలక ప్రకటన.. భారీ సైనిక దాడులు చేస్తామంటున్న ట్రంప్.. అసలేం జరుగుతోంది..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

తెలంగాణ నుంచి తిరుపతికి వేగవంతమైన కనెక్టివిటీ.. నకిరేకల్ - ఏర్పేడు NH-565 పూర్తిగా అందుబాటులోకి..

New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!



Click it and Unblock the Notifications