వాణిజ్య రక్షణవాదం (Protectionism)ను తన ఆర్థిక ఎజెండాలో కీలక అంశంగా మార్చుకున్న ట్రంప్..దేశీయ ట్రక్ తయారీదారులు అన్యాయమైన విదేశీ పోటీ వల్ల నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ సుంకాల నిర్ణయం ద్వారా పాక్కర్ (Paccar) యాజమాన్యంలోని పీటర్‌బిల్ట్ (Peterbilt), కెన్‌వర్త్ (Kenworth) వంటి అమెరికన్ కంపెనీలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. అలాగే డైమ్లర్ ట్రక్ (Daimler Truck) యాజమాన్యంలోని ఫ్రైట్‌లైనర్ (Freightliner) కంపెనీ కూడా లాభపడనుందని తెలిపారు.
తాజా tariff చర్య ప్రధానంగా యూరోపియన్ ఆటోమేకర్లు, జపాన్,మెక్సికో, కెనడా, జర్మనీ, ఫిన్లాండ్ వంటి దేశాలపై ప్రభావం చూపనుంది. వీటిలో చాలా దేశాలు అమెరికాకు వాణిజ్య వాహనాలను పెద్దఎత్తున సరఫరా చేస్తున్నాయి. పరిశ్రమ నిపుణుల అంచనా ప్రకారం.. ఈ సుంకాల వల్ల ప్రపంచ సరఫరా గొలుసులు (global supply chains) దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో అమెరికన్ వినియోగదారులపై వాహన ధరలు పెరగడం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం అమెరికాకు మీడియం, హెవీ ట్రక్కులను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశం మెక్సికో. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2019తో పోలిస్తే 2025 నాటికి ఈ వాహనాల ఎగుమతులు మూడు రెట్లు పెరిగి 340,000 యూనిట్లకు చేరుకున్నాయి. యునైటెడ్ స్టేట్స్-మెక్సికో-కెనడా ఒప్పందం (USMCA) ప్రకారం, వాహనాలు ఉత్తర అమెరికాలో కనీసం 64 శాతం విలువను స్థానికంగా ఉత్పత్తి చేస్తే అవి సుంకం లేకుండా కదలవచ్చు. అయితే కొత్తగా విధించిన 25 శాతం సుంకం ఈ నిబంధనకు విరుద్ధంగా ఉండనుంది. USMCA పరిధిలో పనిచేసే స్టెల్లాంటిస్ (Stellantis), జనరల్ మోటార్స్ (GM), ఫోర్డ్ (Ford) వంటి కంపెనీల కార్యకలాపాలను ప్రభావితం చేయవచ్చు.
మెక్సికోలో రామ్ (RAM) ట్రక్కులు, వాణిజ్య వ్యాన్లను ఉత్పత్తి చేసే స్టెల్లాంటిస్ కంపెనీ ఇప్పటికే అధిక ఖర్చులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. మెక్సికోలో తయారైన వాహనాలపై అదనపు సుంకాలను నివారించడానికి వైట్ హౌస్ వద్ద లాబీయింగ్ చేసినట్లు సమాచారం. ఇదే సమయంలో స్వీడన్‌కు చెందిన వోల్వో గ్రూప్ (Volvo Group) మెక్సికోలోని మోంటెర్రీ ప్రాంతంలో 700 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఒక కొత్త హెవీ ట్రక్ ఫ్యాక్టరీని 2026 నాటికి ప్రారంభించబోతోంది. ఈ ఫ్యాక్టరీపై కూడా కొత్త సుంకం ప్రభావం చూపే అవకాశం ఉంది.
మా కార్మికులను రక్షించడానికి, న్యాయాన్ని పునరుద్ధరించడానికి ఈ సుంకాలు అవసరమని ట్రంప్.. వైట్ హౌస్ వద్ద తెలిపారు.విదేశీ డంపింగ్, అన్యాయమైన వాణిజ్య పద్ధతుల వల్ల అమెరికన్ పరిశ్రమలు అణగదొక్కబడటాన్ని మేము ఇక అనుమతించమని స్పష్టం చేశారు. ప్రస్తుతం అమెరికా తేలికపాటి వాహనాలపై 15 శాతం సుంకం విధిస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయం పెద్ద వాహనాలకు కూడా వర్తిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ట్రంప్ గతంలో కూడా జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా భారీ ట్రక్కుల దిగుమతులపై సుంకాలు విధించే సూచనలు ఇచ్చారు.
ఈ 25 శాతం సుంకం నిర్ణయం అమెరికా-యూరోప్ వాణిజ్య సంబంధాలను తీవ్రతరం చేయవచ్చు. అదే సమయంలో దేశీయ ట్రక్ తయారీదారులకు పోటీ ప్రయోజనం లభించవచ్చు. అయితే దీని ప్రతిఫలం వినియోగదారుల ఖర్చులు పెరగడం, సరఫరా గొలుసుల అంతరాయం,ప్రపంచ ఆటో పరిశ్రమలో అస్థిరత రూపంలో కనిపించవచ్చు.
More From GoodReturns

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications