అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనా దిగుమతులపై 100 శాతం కొత్త సుంకాలు ప్రకటించారు. ఈ చర్యతో పాటు, ఆయన చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో జరగాల్సిన రాబోయే శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేయవచ్చని సంకేతాలు ఇచ్చారు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని బీజింగ్ యొక్క దూకుడు వాణిజ్య చర్యలకు ప్రతీకారంగా పేర్కొన్నారు.
నవంబర్ 1 నుండి అమల్లోకి రానున్న ఈ కొత్త Tariffs.. అన్ని కీలకమైన సాఫ్ట్‌వేర్‌లపై అమెరికా ఎగుమతి నియంత్రణలతో పాటు అమలు చేయబడతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఆయన తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో చైనా అలా వ్యవహరిస్తుందని ఊహించడం అసాధ్యం, కానీ వారు చేశారు, ఇప్పుడు మిగిలింది చరిత్ర మాత్రమే" అంటూ రాసుకొచ్చారు. ట్రంప్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు కుదుపులకు లోనయ్యాయి. వాషింగ్టన్-బీజింగ్ మధ్య మరో వాణిజ్య యుద్ధం చెలరేగుతుందనే ఆందోళనతో నాస్‌డాక్ 3.6 శాతం, S&P 500 2.7 శాతం పతనమయ్యాయి.

ఇప్పటికే ట్రంప్ పదవీకాలంలో ఇప్పటికే చైనా ఎగుమతులపై 30 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. ఆయన అప్పట్లో బీజింగ్‌పై అన్యాయ వాణిజ్య పద్ధతులు, ఫెంటానిల్ సంక్షోభంలో భాగస్వామ్యం వంటి ఆరోపణలు చేశారు. దీనికి ప్రతీకారంగా చైనా కూడా అమెరికా వస్తువులపై 10 శాతం సుంకాలు కొనసాగించింది.తాజా ఉద్రిక్తతకు కారణం ఏంటంటే.. చైనా అరుదైన భూమి ఖనిజాలపై ఎగుమతి పరిమితులను ప్రకటించడంతో ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ వ్యవస్థలు, పునరుత్పాదక ఇంధన పరికరాల తయారీలో కీలకమైన ఈ ఖనిజాల ఉత్పత్తిలో చైనా ఆధిపత్యం కలిగి ఉంది.
ప్రపంచాన్ని బంధించటానికి చైనాను అనుమతించలేమని ట్రంప్ పేర్కొంటూ, బీజింగ్ వైఖరిని చాలా శత్రుత్వంగా అభివర్ణించారు. ఈ నెల చివర్లో దక్షిణ కొరియాలో జరగబోయే APEC శిఖరాగ్ర సమావేశంలో జిన్‌పింగ్‌ను కలవాలనే ప్రణాళికను ఆయన ప్రశ్నార్థకం చేశారు. నేను రెండు వారాల్లో APECలో జిన్‌పింగ్‌ను కలవాల్సి ఉంది. కానీ ఇప్పుడు అలా చేయడానికి ఎటువంటి కారణం కనిపించడం లేదని ట్రంప్ తన పోస్ట్‌లో రాశారు.ఇది జనవరిలో ఆయన వైట్‌హౌస్‌కు తిరిగి వచ్చిన తరువాత వారి మొదటి ముఖాముఖి భేటీగా ఉండాల్సింది. అయితే బీజింగ్ ఇంకా ఈ పరిణామంపై అధికారికంగా స్పందించలేదు.
గత ఆరు నెలలుగా అమెరికా-చైనా సంబంధాలు కొంత స్థిరంగా ఉన్నప్పటికీ, ట్రంప్ వ్యాఖ్యలతో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తమవుతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో రెండు దేశాలు పరస్పర సుంకాల తర్వాత సమాధానకర దశకు చేరుతాయని విశ్లేషకులు భావించినా, తాజా పరిణామాలు ఆ సమాధానాన్ని దెబ్బతీశాయి. ట్రంప్ ప్రకారం చైనా యొక్క గొప్ప వాణిజ్య శత్రుత్వం గురించి అనేక దేశాలు అమెరికాతో సంప్రదించాయని ఆయన తెలిపారు. చైనా నిశ్శబ్దంగా అరుదైన భూమి ఎగుమతులపై తన పట్టును బిగిస్తోందని ఆయన ఆరోపించారు. ట్రంప్ తాజా సుంకాల వెనుక రాజకీయ ఉద్దేశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.
FCC కమిషనర్ బ్రెండన్ కార్ దీనిపై హెచ్చరిస్తూ, చైనా కమ్యూనిస్ట్ పార్టీ అమెరికా ఇళ్లలో, వ్యాపారాల్లో అసురక్షిత పరికరాలను నెటడానికి ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఏదేమైనా ట్రంప్ చైనాపై విధించిన 100 శాతం సుంకాలు కేవలం ఆర్థిక ప్రతీకార చర్య మాత్రమే కాకుండా, భవిష్యత్ భౌగోళిక-రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే కీలక మలుపుగా మారాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!



Click it and Unblock the Notifications