డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా వలస వ్యవస్థలో మరో పెద్ద మార్పుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రయాణ నిషేధం ఉన్న దేశాలకు చెందిన ప్రజలకు శాశ్వత నివాసం, గ్రీన్ కార్డు జారీని ఆపే దిశగా కొత్త విధాన ముసాయిదాలు రూపొందిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ముఖ్యంగా ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని 12 దేశాల పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రతిపాదన వస్తోంది. ఈ దేశాల నుంచి ఇప్పటికే అమెరికాలో నివసిస్తున్న పౌరులకు.. వారి గ్రీన్ కార్డు దరఖాస్తులను నిలిపివేయడం, వీసా ఆమోదాలను పరిమితం చేయడం వంటి కఠిన చర్యలను సూచిస్తోంది.
ట్రంప్ ప్రభుత్వం 2025 జూన్‌లో అమలు చేసిన ప్రయాణ నిషేధం కింద ఆఫ్ఘనిస్తాన్, చాడ్, కాంగో రిపబ్లిక్, ఈక్వటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, మయన్మార్, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాల ప్రజలు ఇప్పటికే అమెరికా ప్రవేశంపై భారీ ఆంక్షలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు.. ఈ ప్రయాణ నిషేధాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో, ఆ దేశాల ప్రజలు అమెరికాకు సరిపడ భద్రతా సమాచారాన్ని లేదా గుర్తింపు ధృవీకరణ వివరాలను అందించలేదన్న వాదనల ఆధారంగా, శాశ్వత నివాస హోదాపై పూర్తిగా నిషేధం విధించాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఆ దేశాల్లో జారీచేసే పాస్‌పోర్ట్‌లు, ఇతర అధికారిక పత్రాల విశ్వసనీయతపై అనుమానాలు ఉన్నందునే ఈ నిర్ణయం అవసరమని ముసాయిదా పత్రాలు పేర్కొంటున్నాయి.

అయితే ఈ నిషేధం పూర్తిగా blanket ban కాదు. ఇప్పటికే గ్రీన్ కార్డు కలిగి ఉన్నవారు, చట్టబద్ధంగా వీసాలు ఉన్నవారు, 2026 వరల్డ్ కప్ లేదా 2028 ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్లు, అలాగే అమెరికా ప్రత్యేక వలస కార్యక్రమానికి అర్హత పొందిన ఆఫ్ఘాన్లకు ఈ పరిమితులు వర్తించవు. కానీ తాత్కాలిక వీసాలపై ఉన్నవారు, అలాగే ఆశ్రయం కోరుతున్నవారు, ఇంకా శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసిన వారు ఈ కొత్త ముసాయిదాకు తీవ్రంగా ప్రభావితమవుతారు.
అమెరికా అధ్యక్షుడు Trump మొదటి పదవీకాలంలో అమలు చేసిన కఠిన వలస వ్యూహాన్నే ఈ ప్రతిపాదన కొనసాగిస్తోంది. అమెరికాకు "సహకరించని" లేదా "అధిక ప్రమాదకర" దేశాలను లక్ష్యంగా చేసుకుని, అమెరికా భద్రతా ప్రమాణాలను పెంపొందించడమే ఈ విధానానికి ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్‌మెనిస్తాన్, వెనిజులా వంటి మరిన్ని దేశాలు పాక్షిక ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్‌లో ఇవి కూడా పూర్తి నిషేధ జాబితాలో చేరే అవకాశముందని ముసాయిదా పత్రాలు సూచిస్తున్నాయి.
ఈ నూతన పరిమితులు అమల్లోకి వస్తే.. అమెరికాలో సంవత్సరాలుగా ఉంటూ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది వలసదారుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిపోతుంది. తాత్కాలిక వీసాలపై ఉన్నవారు తమ స్థితిని పునరుద్ధరించుకోలేకపోవచ్చు. విద్య, ఉద్యోగం, కుటుంబ భద్రత వంటి విషయాలు కూడా సవాళ్లను ఎదుర్కొనే అవకాశముంది. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న దూకుడు వలస నియంత్రణ చర్యలకు ఇది మరొక పొర జోడించనుందనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజా ముసాయిదా.. అమెరికా వలస వ్యవస్థపై భారీ ప్రభావాన్ని చూపేలా కనిపిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే వలసదారుల జీవితాలలో పెద్ద మార్పులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications