భారతీయుల ఉద్యోగాలపై మరో బాంబు పేల్చబోతున్న ట్రంప్.. జస్ట్ ఇన్ అంటూ లారా సంచలన పోస్ట్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సరికొత్త పల్లవి అందుకున్నారు. అమెరికన్ ఫార్ రైట్ కార్యకర్త లారా లూమర్ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. ట్రంప్ భారతీయ ఐటీ కంపెనీలకు అవుట్‌సోర్సింగ్ పనిని నిరోధించే అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఆమె సోషల్ మీడియా వేదిక X (గతంలో ట్విట్టర్)లో జస్ట్ ఇన్ అంటూ చేసిన పోస్ట్‌లో అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు US ఐటీ కంపెనీలు తమ పనిని భారతీయ కంపెనీలకు అవుట్‌సోర్స్ చేయకుండా ఆపే మార్గాలపై ఆలోచిస్తున్నారని రాశారు. దీనికి తోడు కాల్ సెంటర్లను మళ్లీ అమెరికన్లుగా మార్చండి అనే నినాదాన్ని కూడా ప్రస్తావించారు.
ఈ నిర్ణయం అమలు చేయడం జరిగితే దాని ప్రభావం భారతదేశంపై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. భారతీయ ఐటీ పరిశ్రమ సంవత్సరానికి వందల కోట్ల డాలర్ల విలువైన కాంట్రాక్టులను అమెరికన్ కంపెనీల నుంచి పొందుతోంది. ఈ కాంట్రాక్టుల వల్లే దేశంలో లక్షలాది ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి. ముఖ్యంగా బ్యాకెండ్ సపోర్ట్, కస్టమర్ కేర్, సాంకేతిక సేవలు, సాఫ్ట్‌వేర్ అభివృద్ధి రంగాలలో. ఒకవేళ అమెరికా అవుట్‌సోర్సింగ్‌ను నిరోధిస్తే, ఈ రంగంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కోల్పోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లారా లూమర్ మాట్లాడుతూ.. ఇకపై అమెరికన్లు కస్టమర్ కేర్‌కి కాల్ చేసినప్పుడు ఇంగ్లీషు వినడానికి నంబర్ 2 నొక్కాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే కాల్ సెంటర్లు అమెరికాలో తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. ఆమె ఈ వ్యాఖ్యలతో పాటు, అమెరికా ఫస్ట్ విధానాన్ని మరింత బలంగా కొనసాగించాలని Donald Trump ప్రయత్నిస్తున్నారని సూచించారు. ఈ చర్చలో మరొక అమెరికన్ కార్యకర్త జాక్ పోసోబిక్ కూడా జోక్యం చేసుకున్నారు. ఆయన అభిప్రాయం ప్రకారం విదేశీ రిమోట్ కార్మికులపై సుంకాలు విధించాలని, దేశాలు అమెరికాకు రిమోట్ సర్వీసులు అందించే ప్రత్యేక హక్కు కోసం చెల్లించాలని అన్నారు.
ఈ అభిప్రాయాన్ని వైట్ హౌస్ మాజీ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో కూడా సమర్థించినట్లు తెలుస్తోంది. ఆయన Xలో "ఇది టారిఫ్ సమయం" అంటూ భారతదేశం వంటి దేశాలకు అవుట్‌సోర్సింగ్ చేయడం అమెరికన్ కార్మికుల వేతనాలను, ఉపాధిని అణచివేస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రకటనలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అవుట్‌సోర్సింగ్ ఆపితే ఉద్యోగాలు అమెరికాలోకి రావు. కంపెనీలు నేరుగా భారతదేశంలో పెట్టుబడి పెట్టి, అభివృద్ధి కేంద్రాలను అక్కడే ఏర్పాటు చేస్తాయి. దీని వలన అమెరికా మళ్లీ ఉద్యోగాలు మళ్లీ కోల్పోతుందని హెచ్చరించారు. మరికొందరు మాత్రం ఇది చాలా కాలంగా జరగాల్సిన పని. US ఐటీ ఉద్యోగాలు అమెరికన్లకు ఇవ్వాలి. H-1B వీసాల ద్వారా వచ్చిన భారతీయులు ఎక్కువగా తమవారిని మాత్రమే నియమిస్తున్నారని విమర్శించారు.
కొంతమంది అమెరికన్ నెటిజన్లు భారతదేశంపై నేరుగా దాడి చేస్తూ..ఇకపై భారతదేశం మిత్రదేశం కాదు. అమెరికాకు ఎటువంటి మద్దతు అర్హం కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు.. కొందరు దీనిని స్వాగతిస్తూ చౌకైన కూలీల కోసం అమెరికన్ కంపెనీలు భారతదేశంలో పూర్తి అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తాయి.అయితే ఇది భవిష్యత్తులో అమెరికాకు నష్టమేనని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications