Trump: ట్రంప్ లక్ష్యంగా కాల్పులు.. టేబుల్స్ కింద దాక్కున్న అతిథులు! అసలేం జరిగిందంటే..

అమెరికా రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. వాషింగ్టన్ హిల్‌టన్ హోటల్‌లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ ఘనంగా జరుగుతున్న సమయంలో ఊహించని ఘటన ఎదురైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) లక్ష్యంగా కాల్పులు జరగడంతో అక్కడున్న వారంతా వణికిపోయారు. ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో వేల సంఖ్యలో ఉన్న అతిథులు ప్రాణ భయంతో అటూ ఇటూ పరుగులు తీశారు.

Trump Evacuated After Shots Fired At White House Dinner Suspect Arrested Washington Hotel Incident

అసలేం జరిగింది?

శనివారం రాత్రి జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌కు ట్రంప్ (Trump), ఆయన భార్య మెలానియా ట్రంప్, , వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వెన్స్ హాజరయ్యారు. వేదికపై సందడి నెలకొన్న తరుణంలో అకస్మాత్తుగా కాల్పులు మొదలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. దాదాపు 5 నుంచి 8 రౌండ్ల కాల్పుల శబ్దం వినిపించింది. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై "గెట్ డౌన్" అని కేకలు వేయడంతో అతిథులు టేబుల్స్ కింద దూరి ప్రాణాలు కాపాడుకున్నారు. వెంటనే టాక్టికల్ టీమ్స్ రంగంలోకి దిగి ట్రంప్ దంపతులను, జేడీ వెన్స్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు.

షూటర్ ఎవరు?

ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని కాలిఫోర్నియాకు చెందిన 30 ఏళ్ల యువకుడిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు సెక్యూరిటీ చెకింగ్ పాయింట్ వద్దే తుపాకీతో లోపలికి రావడానికి ప్రయత్నించాడని, అయితే సీక్రెట్ సర్వీస్ సిబ్బంది అతడిని అడ్డుకోవడంతో ఈ గొడవ మొదలైందని తెలుస్తోంది. షూటర్‌ను ప్రస్తుతం సీక్రెట్ సర్వీస్ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఈ గందరగోళంలో ఒక పోలీసు అధికారికి కూడా బుల్లెట్ తగిలింది. అయితే ఆయన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పిందని, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని సమాచారం.

ట్రంప్ ఏమన్నారంటే?

ఈ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో స్పందించారు. "షూటర్ దొరికిపోయాడు, భద్రతా దళాలు చాలా గొప్పగా పనిచేశాయి" అని కొనియాడారు. ఇంత గొడవ జరిగినా ఈవెంట్‌ను అనుకున్నట్లే కొనసాగించాలని ఆయన కోరడం విశేషం. ప్రస్తుతం వాషింగ్టన్ హిల్‌టన్ హోటల్ చుట్టూ నేషనల్ గార్డ్ బలగాలు భారీగా మోహరించాయి. ఎవరినీ లోపలికి రానివ్వడం లేదు.

భద్రతా వైఫల్యంపై చర్చ

సాధారణంగా ఇలాంటి పెద్ద ఈవెంట్లకు భద్రత చాలా కఠినంగా ఉంటుంది. అయితే వాషింగ్టన్ హిల్‌టన్ హోటల్ సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండటం వల్ల భద్రతా లోపాలు తలెత్తాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. హోటల్ లోపల కేవలం డిన్నర్ హాల్ దగ్గర మాత్రమే గట్టి తనిఖీలు ఉండటం నిందితుడికి కలిసి వచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా అంతటా ఈ ఘటనపైనే చర్చ జరుగుతోంది. ట్రంప్ (Trump) సురక్షితంగా ఉన్నారని తెలియడంతో ఆయన మద్దతుదారులు ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని వివరాల కోసం అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+