Trump News: అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలోని ఇమ్మిగ్రెంట్లకు చెమటలు పడుతున్నాయి. ఏ క్షణంలో ఎలాంటి బాంబు లాంటి వార్తను ట్రంప్ ప్రకటిస్తారో తెలియక హడలిపోతున్నారు. ఈ క్రమంలోనే పుట్టుకతో అమెరికా పౌరసత్వంపై ఆయన ఫోకస్ భారతీయులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే.. జనవరి 20న 47వ అమెరిగా దేశాధ్యక్షుడిగా పదవిలో ఎంట్రీ ఇచ్చిన ట్రంప్ తొలిరోజునే అనేక కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. వీటిలో చాలా వరకు అమెరికన్లపైనే ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని పొరుగు దేశాలపై ఈ క్రమంలో ట్రంప్ విధించిన సుంకాలు కెనడా, మెక్సికో వంటి దేశాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇక్కడ అన్నింటి కంటే ఎక్కువగా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న అంశం అధ్యక్షుడు ట్రంప్ పుట్టుకతోనే అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేయటమే.

Birthright Citizenship అంటే ఏంటి?
గతంలో అమెరికా గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకు ఆటోమెటిక్‌గా యూఎస్ పౌరసత్వం లభించేది. దీనినే జన్మతహ పౌరసత్వం పొందటం అని అంటారు. అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ద్వారా ఈ నిబంధన పొందుపరచబడింది. విదేశీ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన వారు సైతం ఈ నిబంధన కింద జన్మహక్కు పౌరసత్వాన్ని పొందుతారని రాజ్యాంగ సవరణ వెల్లడిస్తుంది. ఈ సవరణను జూన్ 13, 1866న యూఎస్ కాంగ్రెస్ ఆమోదించిన సంగతి తెలిసిందే.
1861-1865 అంతర్యుద్ధం తర్వాత నల్లజాతీయులకు సమాన పౌర, చట్టపరమైన హక్కులను కల్పించే లక్ష్యంతో దీనిని తీసుకురావటం జరిగింది. దీని కింద అప్పటి నుంచి అమెరికాలో పుట్టిన ఇతర జాతుల పిల్లలకు సైతం అమెరికాలో పుట్టినట్లయితే వారికి పౌరసత్వం ఇవ్వటం కొనసాగుతూ వచ్చింది. అయితే అందరికీ ఇలా జన్మతహ పౌరసత్వాన్ని అందించే ఏకీకృత విధానాన్ని ముగించాలని ప్రస్తుతం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చూస్తోంది.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల ఇకపై ఎవరైనా వ్యక్తి అమెరికా భూభాగంలో జన్మించినప్పటికీ వారికి ఆటోమెటిక్‌గా పౌరసత్వం మంజూరు చేయబడదని చెబుతోంది. దీనికింద ప్రకచింటిన నిబంధనలను పరిశీలిస్తే..
1. పిల్లవాడు పుట్టిన సమయంలో తల్లి అమెరికాలో చట్టవ్యతిరేకంగా నివసిస్తూ, బిడ్డ తండ్రి అమెరికా పౌరుడు కాకపోవటం లేదా ఆ సమయంలో శాశ్వత నివాసి కాకపోతే సదరు బిడ్డకు అమెరికా పౌరసత్వం ఇకపై అందించబడదని తెలుస్తోంది.
2. రెండవ పరిస్థితిని పరిశీలిస్తే.. అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చిన తల్లి తాత్కాలికంగా టూరిస్టుగా, విద్యార్థి వీసాపై లేదా పనిచేస్తున్నట్లయితే సదరు పుట్టిన బిడ్డకు వారసత్వం లభించదు. ఇదే సమయంలో సదరు బిడ్డ తండ్రి అమెరికా పౌరుడు కాకపోవటం లేదా ఆ సమయంలో శాశ్వత నివాసి కాకపోతే సిటిజన్షిప్ స్వయంచాలకంగా లభించదు.
3. ట్రంప్ తన కొత్త పౌరసత్వ ఆర్డర్‌పై సంతకం పెట్టడంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు సైతం ఆందోళన చెందుతున్నారు. తమపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే ఆందోళనలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. తాజా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇప్పుడు అమెరికాలో జన్మించిన వలసదారుల పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తున్న వేళ యూఎస్‌లోని భారతీయ జంటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చాలా మంది అమెరికాలో తాత్కాలిక వీసాలపై నివశించటం వల్ల సమస్య పెద్దదిగా కనిపిస్తోంది. కొత్త ఆర్డర్ 30 రోజుల్లో అమలులోకి రానుంది. ఈ మధ్య పుట్టే పిల్లలకు ఇది వర్తించదు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications