ట్రంప్ పన్ను: ఇండియా ఏఐ డేటా సెంటర్ కలలు ముప్పులో!
ప్రపంచాన్ని ఏలబోతున్న ఏఐ టెక్నాలజీ రంగంలో పెద్ద భారతీయ కంపెనీలు లేవు. అందుకే, అమెరికా కంపెనీల కోసం డేటా సెంటర్లు నిర్మించే ప్రాజెక్టులపై భారత్ ఎక్కువగా దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ కీలక హెచ్చరిక జారీ చేశారు. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్-చైనా మహిళా గూఢచారికి మధ్య సంబంధం ఉందన్న వివాదం తర్వాత, విదేశాల్లో డేటా సెంటర్లు పెట్టే అమెరికన్ కంపెనీలపై భారీగా పన్నులు వేస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
ఈ ఒక్క ప్రకటనతో, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ హబ్‌గా మారాలన్న భారత్ కలలకు పెద్ద గండి పడినట్లయింది.
ఇటీవలే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు భారత్‌లో భారీ స్థాయిలో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి.

భారత్‌లో దాదాపు 10-20 బిలియన్ డాలర్ల పెట్టుబడితో నిర్మించే ఈ డేటా సెంటర్ల ద్వారా, కేవలం మన దేశానికే కాకుండా ఆసియా మార్కెట్ మొత్తానికి సేవలు అందించాలని ఈ కంపెనీలు ప్లాన్ చేశాయి.
విదేశీ కంపెనీలకు డేటా సెంటర్లు ఏర్పాటు చేయడంలో భారత్ అత్యంత అనువైన ప్రదేశంగా ఉన్న తరుణంలో, ట్రంప్ ప్రకటించిన "tremendous tax" (భారీ పన్ను) హెచ్చరిక ఈ రంగాన్ని తలకిందులు చేసేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పన్నుపై ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, విదేశాల్లో అమెరికా కంపెనీలు ఏర్పాటు చేసే డేటా సెంటర్లను చైనా కంపెనీలు సులభంగా చేజిక్కించుకుంటాయని, తద్వారా అమెరికా కంప్యూటింగ్ పవర్‌ను చైనా తన సొంత ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి వాడుకునే ప్రమాదం ఉందని వివరించారు.
ప్రతీ డేటా సెంటర్, ప్రస్తుతం చైనాకు ఎగుమతి చేయకుండా అమెరికా నిషేధించిన ఎన్విడియా జీపీయూ(GPU)లనే వాడుతుంది. ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి, వాటిని రన్ చేయడానికి ఇవి చాలా అవసరం.
ఈ పరిస్థితుల్లో, విదేశాల్లో ఉన్న డేటా సెంటర్లను చైనా కంపెనీలు కొనడం లేదా అద్దెకు తీసుకోవడం ద్వారా తమ ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు చాలా అవకాశాలున్నాయి.
చైనాకు ఎన్విడియా చిప్‌ల ఎగుమతిపై నిషేధం ఉన్నందున, చైనాకు ఇదే ప్రత్యామ్నాయ మార్గమని ట్రంప్ ప్రభుత్వం నమ్ముతోంది. అందుకే అమెరికా కంపెనీలు విదేశాల్లో డేటా సెంటర్లు పెట్టొద్దని హెచ్చరించింది.
ఈ "loophole"ను మూసివేయాలనే ప్రయత్నంలో భాగంగానే "tremendous tax" విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications