అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీ ఎన్విడియాపై చేసిన కుట్ర బట్టబయలైంది. అమెరికాలో తైవాన్ కంపెనీని విచ్ఛిన్నం చేయాలనకున్నట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. అలా చేయడం ద్వారా కృత్రిమ మేధస్సులో ఉపయోగించే చిప్‌ల మార్కెట్‌లో పోటీని పెంచవచ్చని ఆయన నమ్మాడు. అయితే ఆ ప్రణాళిక బెడిసి కొట్టింది.
తన సహచరుల వార్నింగ్ తో వెనక్కి తగ్గాడు. ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా కార్పొరేషన్ ధ్వంసం అంత తేలిక కాదని వారు హెచ్చరించారని.. దీంతో తన ఆలోచన నుండి వెనక్కి వచ్చానని ఆయన చెప్పారు. కాగా 4 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌ను సాధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి కంపెనీగా ఎన్విడియా నిలిచింది. దీనిని 1993లో తైవానీస్ మూలానికి చెందిన జెన్సెన్ హువాంగ్ స్థాపించారు.
బుధవారం వాషింగ్టన్‌లో జరిగిన ఒక AI సమ్మిట్‌లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. నేను ఈ కంపెనీని విచ్ఛిన్నం చేయాలని అనుకున్నానని అన్నారు. కానీ తరువాత అది అంత సులభం కాదని తెలిసింది. ఎన్విడియా ఆధిపత్యం చాలా ఎక్కువగా ఉందని, ఇతర కంపెనీలు దానితో పోటీ పడటానికి చాలా సంవత్సరాలు పడుతుందని ఆయన సహచరులు చెప్పడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు.మనం వెళ్లి దానిని కొంచెం విచ్ఛిన్నం చేయగలమని, కొంత పోటీని తీసుకురావచ్చని నేను అనుకున్నాను. కానీ అది అంత సులభం కాదని నాకు తెలిసిందన్నారు. అయితే ఎన్విడియా ట్రంప్ వ్యాఖ్యలపై ఇంకా స్పందించలేదు.

ఈ కార్యక్రమంలో, ట్రంప్ ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మీరు అద్భుతమైన పని చేస్తున్నారని ట్రంప్ అన్నారు. ఈ సమావేశానికి హాజరైన హువాంగ్ కూడా ట్రంప్‌ను ప్రశంసించారు. ఈ రంగంలో అమెరికాకు ఉన్న ప్రత్యేక స్థానం ట్రంప్ నాయకత్వం వల్లే సాధ్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ఈ నెల ప్రారంభంలో జెన్సెన్ హువాంగ్ వైట్ హౌస్‌లో ట్రంప్‌ను కలిశారు. ఇటీవల చైనాతో జరిగిన వాణిజ్య ఒప్పందాల ప్రభావంతో Nvidia తన H20 AI చిప్‌లను చైనాకు విక్రయించేందుకు మళ్లీ అనుమతి పొందినట్లు ప్రకటించింది. గతంలో ట్రంప్ పరిపాలన కాలంలో ఈ అమ్మకాలు నిషేధించారు.
బుధవారం ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసిన AI బ్లూప్రింట్ ద్వారా పర్యావరణ నియంత్రణలను సడలిస్తూ.. మిత్రదేశాలకు AI సాంకేతికతను విస్తరించే దిశగా అమెరికా కృషి చేయనుంది. ఈ చర్యలు చైనాపై సాంకేతిక ఆధిపత్యాన్ని నిలుపుకోవడంలో భాగమని ట్రంప్ పేర్కొన్నారు.ఇది ఒక సాంకేతిక యుద్ధం. ఇది 21వ శతాబ్దాన్ని నిర్వచించే పోరాటయని ట్రంప్ స్పష్టం చేశారు. కృత్రిమ మేధస్సు రంగంలో Nvidia అమితవేగంతో దూసుకుపోతోంది. భారీగా లాభాలు నమోదు చేస్తూ, ఇటీవలే 4 ట్రిలియన్ డాలర్ మార్కెట్ విలువను దాటి తొలి కంపెనీగా నిలిచింది.
AI, చిప్ రంగాలలో అమెరికా, చైనాల మధ్య సాగుతున్న పోటీ నేపథ్యంలో, ట్రంప్ వ్యాఖ్యలు పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరింత పోటీ, నియంత్రణ,పెట్టుబడుల కోసం అమెరికా ఇప్పుడు కొత్త దిశలో ప్రయాణం ప్రారంభించినట్లు కనిపిస్తోంది.ప్రపంచవ్యాప్తంగా AI హార్డ్‌వేర్‌కు డిమాండ్ పెరగడం వల్ల ఈ కంపెనీ ఎంతో ప్రయోజనం పొందింది. ఇదిలా ఉంటే గత సంవత్సరం యుఎస్ న్యాయ శాఖ ఎన్విడియాను విచారించింది. కంపెనీ పోటీ వ్యతిరేక ప్రవర్తనకు సంబంధించిన ఆధారాలను కనుగొనడానికి ఈ దర్యాప్తు జరిగింది. ఈ నేపథ్యంలోనే బుధవారం ట్రంప్ AI యాక్షన్ ప్లాన్‌ను ఆవిష్కరించారు. పరిశ్రమపై నియంత్రణ భారాన్ని తగ్గించడం దీని లక్ష్యం.
More From GoodReturns

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

ఖతార్ LNG ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. ట్రంప్ ఆందోళన.. గ్లోబల్ ఇంధన సంక్షోభం..

ఇరాన్‌ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..

ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం.. అమెరికా వదిలి వెళ్లిపోవాలంటూ భారతీయులకు ఆఫర్..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!



Click it and Unblock the Notifications