అగ్రరాజ్యం అమెరికా దెబ్బకు సహజ సంపదలతో అలరారే వెనిజులా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అధికారం నుంచి తొలగించిన అనంతరం ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఆ దేశ చమురుతో పాటుగా దాని మీద వచ్చే ఆదాయంపై పెత్తనం సాగిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు.
ఇందులో భాగంగా వెనెజువెలాతో కీలక చమురు ఒప్పందాన్నిఅధికారికంగా ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు వెల్లడించిన అధికారిక ఒప్పందం ప్రకారం.. వెనెజువెలా 40 నుంచి 50 మిలియన్ బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్‌ను యుఎస్ కు ఇవ్వనుంది. వాటి ధరతో పాటు అమ్మకాలు, కొనుగోలు వ్యవహారాలకు సంబంధించిన అన్ని విషయాలు అమెరికానే పర్యవేక్షిస్తుందని సోషల్ ట్రూత్ వేదికగా ట్రంప్ ప్రకటించారు.
Venezuela ఇప్పుడు 50 మిలియన్ బ్యారెళ్ల చమురును అమెరికాకు అప్పగించనుందనే ప్రకటన అంతర్జాతీయ రాజకీయాలు, ఎనర్జీ మార్కెట్లలో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.ఈ చమురు విలువ సుమారు 2.8 బిలియన్ డాలర్లగా అంచనా వేయడం జరిగింది. ట్రంప్ మాటల్లో చెప్పాలంటే.. ఈ చమురును మార్కెట్ ధరలకే విక్రయించి.. దాని ద్వారా వచ్చే నిధులను తాను నియంత్రిస్తానని, వాటిని వెనిజులా- అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం వినియోగిస్తానని తెలిపారు. ఇది కేవలం ఆర్థిక నిర్ణయం మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా కీలకమైన వ్యూహంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

మదురోను మాదకద్రవ్య అక్రమ రవాణా, ఆయుధాల ఆరోపణల నేపథ్యంలో అమెరికాకు తీసుకువచ్చిన తర్వాత.. వెనిజులాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మాజీ ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. వచ్చే 18 నెలల్లో వెనిజులాలో అమెరికా చమురు పరిశ్రమ పునఃప్రారంభం అవుతుందని, భారీగా విదేశీ పెట్టుబడులు వస్తాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, నిపుణులు మాత్రం వెనిజులా చమురు ఉత్పత్తిని పూర్వ స్థాయికి తీసుకురావడానికి పదివేల కోట్ల డాలర్లు, అలాగే ఒక దశాబ్దం సమయం పట్టవచ్చని హెచ్చరిస్తున్నారు.
వెనిజులాకు ప్రపంచంలోనే అతిపెద్ద నిరూపిత చమురు నిల్వలు ఉన్నాయి. దాదాపు 303 బిలియన్ బ్యారెళ్లు ఉన్నప్పటికీ 2000ల ప్రారంభం నుంచి అక్కడి ఉత్పత్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. పాత మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల కొరత, రాజకీయ అస్థిరతగా ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ప్రస్తుతం వెనిజులాలో పనిచేస్తున్న ఏకైక అమెరికా చమురు సంస్థ చెవ్రాన్. సంస్థ ప్రతినిధులు, ఉద్యోగుల భద్రత, ఆస్తుల రక్షణే తమ ప్రధాన ప్రాధాన్యత అని తెలిపారు. కోనోకోఫిలిప్స్, ఎక్సాన్ వంటి సంస్థలు పరిస్థితిని గమనిస్తున్నామని మాత్రమే తెలిపాయి.
ఇదిలా ఉంటే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెనిజులా గతంలో అమెరికన్ చమురు ఆస్తులను దొంగిలించిందని ఆరోపించారు. అయితే, నిపుణులు ఈ వాదనను అతి వ్యాఖ్యలుగా భావిస్తున్నారు. వాస్తవానికి, 1976లో వెనిజులా తన చమురు పరిశ్రమను జాతీయీకరించింది. 2007లో హ్యూగో చావెజ్ ప్రభుత్వం యుఎస్ చమురు సంస్థలు, అలాగే విదేశీ సంస్థలపై మరింత కఠిన నియంత్రణలు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే.. 2019లో ప్రపంచ బ్యాంకు ట్రిబ్యునల్ కోనోకోఫిలిప్స్‌కు 8.7 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని వెనిజులాను ఆదేశించింది. ఇప్పటికీ ఆ మొత్తం బకాయిగానే ఉంది.
క్లుప్తంగా చెప్పాలంటే వెనిజులా చమురు అంశం కేవలం వాణిజ్య ఒప్పందం కాదు. ఇది గ్లోబల్ ఎనర్జీ సరఫరా, చమురు ధరలు, అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలు, లాటిన్ అమెరికా రాజకీయ భవిష్యత్తు అన్నింటినీ ప్రభావితం చేసే అంశంగా మారింది.ఇక డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే వెనెజులాలో వెలికి తీసిన చమురును బ్యారెల్స్‌లో నింపారు. సముద్ర నౌకల ద్వారా యుఎస్ గల్ఫ్ కోస్ట్ ప్రాంతంలోని రీఫైనరీలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయ.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించిన టెహ్రాన్..అమెరికా యుద్ధ విమానం కూల్చివేత

ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications