అమెరికా - ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో ఒక కీలకమైన మలుపు చోటుచేసుకున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అణ్వాయుధాల తయారీ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గిందని.. ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయబోదని అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైట్ హౌస్‌లో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు.. ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చల పురోగతికి అద్దం పడుతున్నాయి.
ఇరాన్‌తో జరుగుతున్న చర్చల సారాంశాన్ని వివరిస్తూ.. ఆ దేశం తన అణు కాంక్షను విరమించుకోవడానికి సిద్ధంగా ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. "గుర్తుంచుకోండి, వారి వద్ద అణ్వాయుధం ఉండకూడదనే ప్రాథమిక అంశంతోనే ఈ చర్చలన్నీ మొదలయ్యాయి. తమ వద్ద ఎప్పటికీ అణ్వాయుధం ఉండకూడదని వారు అంగీకరించారు. దానికి వారు ఒప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అధికారులు బహిరంగంగా ఈ విషయాన్ని ఖండించినప్పటికీ.. టెహ్రాన్ ఇప్పుడు అత్యంత "వివేకంతో", "హేతుబద్ధంగా" మాట్లాడుతోందని Trump అభిప్రాయపడ్డారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందం వైపు అడుగులు పడుతున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాకు ఇరాన్ వ్యవహారాల్లో పూర్తి స్వేచ్ఛ ఉందని, తాము అనుకున్నది సాధించగలమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ నాయకత్వం ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉందని, అందుకే వారు అమెరికాతో ఒక గౌరవప్రదమైన ఒప్పందానికి రావాలని ఎంతగానో పరితపిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఎవరితో మాట్లాడాలో తెలియని అనిశ్చితి ఉండేదని, కానీ ఇప్పుడు అమెరికా సరైన వ్యక్తులతోనే సంప్రదింపులు జరుపుతోందని ఆయన వివరించారు. ఈ చర్చల బృందంలో జేడీ వాన్స్, మార్కో రూబియో, స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ వంటి కీలక నేతలు ఉండటం గమనార్హం.
మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల మధ్య.. ఇరాన్ పొరుగు దేశాలైన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), ఖతార్‌ల ప్రతిస్పందనను ట్రంప్ ప్రత్యేకంగా ప్రశంసించారు. క్షిపణి, డ్రోన్ దాడుల వంటి ముప్పులు పొంచి ఉన్నప్పటికీ.. ఈ దేశాలు చూపుతున్న పరిణతి అద్భుతమని ఆయన కొనియాడారు. ఇరాన్ ఒక ఒప్పందానికి రావడం వల్ల కేవలం అమెరికాకే కాకుండా, మొత్తం గల్ఫ్ ప్రాంతానికి స్థిరత్వం చేకూరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ కొత్త కార్యదర్శిగా సెనేటర్ మార్క్‌వేన్ ముల్లిన్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు, అమెరికా విదేశాంగ విధానంలో రాబోయే మార్పులకు సంకేతంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ ఒక ఒప్పందానికి రావడానికి చూపిస్తున్న ఆసక్తిని ట్రంప్ "అద్భుత విజయం"గా అభివర్ణించారు. అయితే, గతంలో కుదిరిన అణు ఒప్పందాల అనుభవాల దృష్ట్యా, ఇరాన్ తన మాట మీద ఎంతవరకు నిలబడుతుందనేది వేచి చూడాలి. ప్రస్తుతం అమెరికా యంత్రాంగం చూపిస్తున్న దౌత్యపరమైన చొరవ, ఇరాన్ అణు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధి నిండా మందు పాతరలే.. ఏ క్షణమైనా పేలే అవకాశం.. ఇరాన్ స్కెచ్‌కి ట్రంప్ ఫ్యూజులు ఔట్..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన..హార్ముజ్ జలసంధి వేదికగా పశ్చిమాసియాలో సరికొత్త వార్..

Strait of Hormuz: స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ అంటే ఏమిటి? దీన్ని బ్లాక్ చేస్తే భారత్‌కు నష్టమేంటి?

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. భారీగా తగ్గిన చమురు ధరలు.. పుంజుకున్న మార్కెట్లు..

హార్ముజ్ జలసంధి వేదికగా ఇరాన్ భారీ స్కెచ్.. 500 బిలియన్ డాలర్ల రెవిన్యూ టార్గెట్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..

ఇరాన్ 10-సూత్రాల కాల్పుల విరమణ షరతులు ఇవే.. శాంతి చర్చల్లో ట్రంప్ వీటిని అంగీకరిస్తారా.. యుద్ధం ఆగినట్లేనా..

రెండు వారాల పాటు కాల్పుల విరమణ..ఇరు దేశాల మధ్య ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు..



Click it and Unblock the Notifications