యుద్ధం మొదలైంది.. అమెరికా సత్తా ఏంటో ఇరాన్‌కు చూపిస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ఫిబ్రవరి నెలలో United States- Iran మధ్య అణు ఆయుధ ఒప్పందంపై చర్చలు ప్రారంభమైనప్పటి నుంచే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ చర్చల మధ్యనే అమెరికా సైన్యం ఇరాన్ జలాల్లో యుద్ధనౌకలు.. యుద్ధ విమానాలను మోహరించడం ప్రారంభించింది. ఇది ఒక వైపు దౌత్య చర్చలు సాగుతున్నా, మరోవైపు సైనిక సిద్ధతలు కూడా కొనసాగుతున్నాయనే సంకేతాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలోని శనివారం Israel-అమెరికా సంకీర్ణం ఇరాన్‌పై ఆకస్మికం సైనిక దాడిని ప్రారంభించింది.
ఈ దాడి ఇరాన్ అణు సమస్యకు శాంతియుత పరిష్కారం దొరుకుతుందనే ఆశలపై తీవ్ర ప్రభావం చూపింది. అంతేకాకుండా, గల్ఫ్ ప్రాంతమంతటా సైనిక ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ ఇరాన్‌పై తన తొలి ప్రత్యక్ష వైమానిక దాడిని ప్రారంభించిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ముఖ్యంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ మధ్యభాగంలో జరిగిన తొలి దాడి పెద్ద సంచలనం రేపింది. ఇరాన్ సుప్రీం లీడర్ Ayatollah Ali Khamenei కార్యాలయాల సమీపంలో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయని, ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయని సమాచారం.

ఈ దాడిలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటోందని స్వయంగా అమెరికా అధ్యక్షుడు Donald Trump ధృవీకరించారు. ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసిన వీడియో సందేశంలో..ఇరాన్‌లో అమెరికా ప్రధాన సైనిక కార్యకలాపాలను ప్రారంభించింది. అమెరికన్ ప్రజలను రక్షించడానికి, ఇరాన్ పాలన నుంచి ఎదురవుతున్న తక్షణ ముప్పులను పూర్తిగా తొలగించడమే మా లక్ష్యమని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఈ దాడి పరిమిత ఆపరేషన్ కాదని, పెద్ద స్థాయి సైనిక చర్యగా మారే అవకాశముందని స్పష్టం చేస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికా దళాలు ఇరాన్‌పై వైమానిక దాడులు, నావికా దాడులు నిర్వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ప్రభావాలను చూపనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో అంతర్జాతీయ పెట్టుబడి మార్కెట్లలో భారీ ఊగిసలాటలు చోటుచేసుకునే అవకాశం ఉంది. భద్రతా ఆందోళనలు పెరిగిన కారణంగా బంగారం, వెండి వంటి సేఫ్-హేవన్ ఆస్తులు కొత్త గరిష్టాలకు చేరుకునే అవకాశముందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ దాడికి నేపథ్యంగా అమెరికా - ఇజ్రాయెల్ నెలల తరబడి ఇరాన్‌పై దాడి చేసే వ్యూహాన్ని రూపొందించాయని సమాచారం. ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధి తుది దశకు చేరుతోందన్న అనుమానంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ యుద్ధం ఎంతవరకు విస్తరిస్తుందన్నది పూర్తిగా ఇరాన్ ప్రతీకార చర్యలపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. అమెరికా ఈ దాడికి తన నావికాదళం, వైమానిక దళాన్ని సమన్వయంతో ఉపయోగిస్తోంది.
దాడుల వెంటనే రెండు దేశాలు తక్షణ భద్రతా చర్యలు తీసుకున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ రెండూ తమ తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేశాయి. ఇరాన్‌లో దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని అక్కడి మీడియా నివేదిస్తోంది. టెహ్రాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడింగ్ నిలిపివేశారు. భద్రతా కారణాలతో మొబైల్ ఫోన్ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు, ఇజ్రాయెల్ విమానాశ్రయాల అథారిటీ ప్రయాణీకుల విమానాలకు గగనతలం మూసివేయబడిందని ప్రకటించింది. ప్రజలు విమానాశ్రయాలకు రావద్దని స్పష్టంగా హెచ్చరించింది.


Click it and Unblock the Notifications