అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తూ అమెరికన్లను, ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రకంపనలు సృష్టించేలా కొత్త పన్నుల ప్రకటనలు చేయనున్నట్లు ట్రంప్ తెలిపారు.
అమెరికా కేబినెట్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. బ్రిక్స్ దేశాలపై త్వరలో 10 శాతం అదనపు పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన బ్రిక్స్ కూటమిలో ఉన్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలకు షాక్ ఇచ్చింది. ఈ ప్రకటనతో పాటు మరికొన్ని ప్రకటనలను కూడా ట్రంప్ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు.
రాగి దిగుమతులపై 50% పన్ను
అమెరికాలో దిగుమతి చేసుకునే రాగిపై 50 శాతం పన్ను విధిస్తూ ఈ వారం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ట్రంప్ కేబినెట్ సమావేశంలో తెలిపారు. దీని ద్వారా అమెరికా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం పన్నుకు అదనంగా రాగి లోహాన్ని కూడా చేర్చినట్లయింది.

ఈ కొత్త 50 శాతం పన్ను విధానం ద్వారా అమెరికా ఉత్పత్తి పరిశ్రమలను కాపాడవచ్చని, రాగి లోహం ఎలక్ట్రానిక్స్, నిర్మాణం, ఇంధన రంగాలలో ముఖ్యమైన ముడిసరుకుగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ పన్ను అమెరికా దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు.
అయితే ఈ పన్నుల పెరుగుదల అమెరికాలో రాగిని దిగుమతి చేసుకునే సంస్థలకు ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతుంది. ఈ వ్యయ పెరుగుదల చివరికి ప్రజలు కొనుగోలు చేసే వస్తువుల ధరలను పెంచుతుందనడంలో సందేహం లేదు. ఈ 50 శాతం పన్ను ప్రపంచ రాగి సరఫరా గొలుసులో ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.
మందుల దిగుమతులపై 200% పన్ను
జూన్ 8న జరిగిన కేబినెట్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. వాణిజ్య విధానంలో మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. విదేశాల నుంచి అమెరికాకు దిగుమతి చేసుకునే మందులపై 200% వరకు కఠినమైన పన్ను విధించనున్నట్లు తెలిపారు. అయితే ఈ పన్ను వెంటనే అమల్లోకి రాదని కూడా ఆయన స్పష్టం చేశారు.
మందుల కంపెనీలు తమ ఉత్పత్తి కార్యకలాపాలను అమెరికాకు మార్చుకోవడానికి 18 నెలల గడువు ఇస్తామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''మేము ఒక సంవత్సరం లేదా ఒకటిన్నర సంవత్సరం సమయం ఇస్తాము, ఆ తర్వాత ఫార్మా దిగుమతులపై అత్యధిక పన్ను విధిస్తాము’’ అని ట్రంప్ కేబినెట్ సమావేశంలో పేర్కొన్నారు.
ఈ నిర్ణయం అమెరికాలో ఔషధ ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకున్నప్పటికీ, తాత్కాలికంగా మందుల ధరలను పెంచి వినియోగదారులపై భారం మోపవచ్చు. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే అమెరికా మార్కెట్ ఈ పన్నుల పెరుగుదల వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది.
ఉత్పత్తి రంగంలో ఉద్యోగ నష్టం
ట్రంప్ పదవీకాలంలో అమెరికా ఉత్పత్తి రంగంలో ఉద్యోగ నష్టం ఒక ముఖ్యమైన సవాలుగా మారింది. ప్రపంచ పోటీ, సాంకేతిక మార్పుల కారణంగా అమెరికా ఉత్పత్తి రంగంలో ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చడానికి ట్రంప్ రాగి, ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్ దిగుమతులపై పన్నులు విధిస్తున్నారు.
ఈ పన్నులు దేశీయ ఉత్పత్తిని కాపాడతాయని ఆయన నమ్ముతున్నప్పటికీ, ఈ చర్యలు ఉత్పత్తి వ్యయాన్ని పెంచి చివరికి ఉద్యోగాలపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు రాగిపై దిగుమతి పన్ను దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించినప్పటికీ, దిగుమతులపై ఆధారపడే పరిశ్రమలపై భారం పెంచుతుంది. ఇది పరోక్షంగా ఉద్యోగ నష్టానికి దారితీయవచ్చు.
14 విదేశీ అధినేతలకు హెచ్చరిక
ట్రంప్ ఇదివరకే అమెరికాలో దిగుమతి చేసుకునే అన్ని దేశాల వస్తువులపై 10% ప్రాథమిక పన్నును విధించారు. ఈ నేపథ్యంలో అమెరికా ఇప్పటివరకు బ్రిటన్, చైనా, వియత్నాం దేశాలతో వాణిజ్య ఒప్పందం చేసుకుంది.
ట్రంప్ తాజాగా 14 దేశాల అధినేతలకు పన్ను విధింపుపై హెచ్చరిక లేఖలు పంపారు. ఇందులో కొన్ని దేశాలకు 70% వరకు పన్ను విధించే అవకాశం ఉంది. ఆసియా, ఆఫ్రికా దేశాలను లక్ష్యంగా చేసుకుని, దక్షిణ కొరియా, జపాన్, మలేషియా, కజకిస్తాన్‌లకు 25%, దక్షిణాఫ్రికాకు 30%, ఇండోనేషియాకు 32%, బంగ్లాదేశ్‌కు 35%, థాయ్‌లాండ్‌కు 36% పన్ను విధించారు.
ఈ పన్నుల అమలును గతంలో ప్రకటించిన జూలై 9, 2025 నుండి ఆగస్టు 1, 2025కి వాయిదా వేశారు. దీని ద్వారా ఈ దేశాలు రాబోయే 3 వారాల్లో అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవలసి ఉంటుంది.
ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల కొన్ని రంగాలకు మేలు జరిగినా, మరికొన్ని రంగాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో దీని ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.
More From GoodReturns

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications