అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) పర్యటనలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరిన అధ్యక్షుడి అధికారిక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్', గాలిలో ఉండగానే ఒక్కసారిగా వెనక్కి మళ్లింది. సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.

అసలేం జరిగింది?
మంగళవారం సాయంత్రం జాయింట్ బేస్ ఆండ్రూస్ నుండి ట్రంప్ (Trump) తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్ బయలుదేరారు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో "మైనర్ ఎలక్ట్రికల్ ఇష్యూ" ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. విమాన ప్రయాణంలో విద్యుత్ వ్యవస్థలో లోపాలు తలెత్తడం భద్రతాపరంగా అత్యంత ప్రమాదకరం కావడంతో, ఎటువంటి రిస్క్ తీసుకోకూడదని పైలట్లు నిర్ణయించారు. వెనువెంటనే విమానాన్ని మళ్ళీ జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు మళ్లించారు.
వైట్ హౌస్ వివరణ
ఈ ఘటనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందిస్తూ.. "ముందు జాగ్రత్త చర్యగా మాత్రమే విమానాన్ని వెనక్కి రప్పించాం. అధ్యక్షుడు, ఆయన బృందం సురక్షితంగా ఉన్నారు. వారు మరో విమానంలో దావోస్‌కు ప్రయాణాన్ని కొనసాగిస్తారు" అని తెలిపారు. వైట్ హౌస్ రాపిడ్ రెస్పాన్స్ టీమ్ కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే విషయాన్ని ధృవీకరించింది.
ముసలిదవుతున్న ఎయిర్ ఫోర్స్ వన్?
ప్రస్తుతం ట్రంప్ (Trump) వాడుతున్న ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలు దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నాటివి. వీటిని మార్చాలని చాలా కాలంగా ప్రతిపాదనలు ఉన్నాయి. బోయింగ్ సంస్థ కొత్త విమానాల తయారీలో నిమగ్నమైనప్పటికీ, వివిధ కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆలస్యమవుతూ వస్తోంది. గతేడాది ఖతార్ రాజకుటుంబం ట్రంప్‌కు ఒక లగ్జరీ బోయింగ్ 747-8 జంబో జెట్ ను బహుమతిగా ఇచ్చింది. ప్రస్తుతం ఆ విమానానికి భద్రతాపరమైన మార్పులు (Retrofitting) చేస్తున్నారు. అది అందుబాటులోకి వస్తే ఇలాంటి సాంకేతిక ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.
ప్రపంచం దృష్టి దావోస్ పైనే..
సాధారణంగా అమెరికా అధ్యక్షుడి విమాన ప్రయాణం అంటే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. అందులోనూ ట్రంప్ (Trump) లాంటి కీలక నేత ప్రయాణించే విమానంలో లోపం తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. దావోస్ సదస్సులో ప్రపంచ ఆర్థిక స్థితిగతులు, వాణిజ్య ఒప్పందాల గురించి ట్రంప్ కీలక ప్రసంగం చేయాల్సి ఉంది. ఈ చిన్న విరామం తర్వాత ఆయన పర్యటన యథావిధిగా కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు.
ఏది ఏమైనా అత్యంత పటిష్టమైన భద్రత ఉండే అధ్యక్షుడి విమానానికే ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది. ఇది అమెరికా అధ్యక్షుడి భద్రత గురంచి మరోసారి చర్చ లేపింది. మరి అమెరికా ప్రభుత్వం ఇప్పటికైనా ఎయిర్ ఫోర్స్ వన్ విమానాల వాడకం ఆపుతుందో లేదో చూడాలి!
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications