అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ప్రారంభంలో భారత్, పాకిస్తాన్ మధ్య అణు ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలో.. 350 శాతం సుంకాలను విధిస్తానని హెచ్చరించడం ద్వారా ఆ సంక్షోభాన్ని తానే అడ్డుకున్నానని మరోసారి వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌లో జరిగిన యుఎస్-సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరంలో.. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో మాట్లాడుతూ ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలను చేశారు.
భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయని, అణ్వాయుధాలు వినియోగించే అవకాశం ఉందనే భయం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సమయంలో తాను జోక్యం చేసుకున్నానని తెలిపారు. రెండు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి, వారు ఏమి చేయాలని చర్చిస్తున్న సమయంలో నేను వారికి స్పష్టంగా చెప్పాను. అవసరమైతే ప్రతి దేశంపై 350 శాతం సుంకం విధిస్తాను, ఇకముందు అమెరికాతో ఎలాంటి వాణిజ్యం ఉండదని బెదిరించినట్లు Trump తెలిపారు.

నేను వివాదాలను పరిష్కరించడంలో ముందుంటాను. మీరు అణ్వాయుధాలతో ఒకరినొకరు దాడి చేసి, లక్షలాది ప్రాణాలను ప్రమాదంలో పడేయడం కరెక్ట్ కాదు. అంతేకాదు ఆ అణు ధూళి లాస్ ఏంజిల్స్ వరకూ రావడం నేను చూడను. నాకు అది అంగీకారం కాదని చెప్పినట్లుగా తెలిపారు. తాను సుంకాలపై చర్యలకు సిద్ధమై.. ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్‌ను కూడా ఆ దిశగా ఆదేశించానని తెలిపారు.
తాను చేపట్టిన ఈ కఠిన చర్యల తర్వాత రెండు దేశాలు వెనక్కి తగ్గాయని, యుద్ధం కాకుండా వాణిజ్య ఒప్పందం దిశగా కొత్త ప్రతిపాదనలు పెట్టామని చెప్పారు. ఇతర ఎలాంటి అధ్యక్షుడు ఇలా చేయలేడు. నేను సుంకాలను ఒక డిప్లొమాటిక్ ఆయుధంలా ఉపయోగించాను. ఎనిమిది ప్రధాన సంక్షోభాల్లో ఐదు, ఆర్థిక ఒత్తిడి, వాణిజ్య ఒత్తిడితోనే పరిష్కరించబడ్డాయని అన్నారు.
ఇంతటితో ఆగకుండా తన జోక్యం వల్ల లక్షలాది మంది ప్రాణాలు రక్షించుకున్నామని పేర్కొన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మొదటగా ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారని, తరువాత భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా మాట్లాడి.. మనం పూర్తి చేసాం, యుద్ధానికి వెళ్ళడం లేదని చెప్పారని ట్రంప్ అన్నారు. తాను వెంటనే అయితే ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకుందామని సూచించానన్నారు. అయితే, ట్రంప్ ఇలా చెప్పడం కొత్తేమి కాదు. సోషల్ మీడియాలో మొదటిసారి ఈ 'అణు ఘర్షణ నివారణ' కథనాన్ని ఆయన ప్రకటించినప్పటి నుండి ఇప్పటివరకు 60 సార్లు పైగా ఇదే వ్యాఖ్యను పునరావృతం చేస్తున్నారు.
ఇక భారతదేశం మాత్రం ఈ వాదనలను స్పష్టంగా ఖండిస్తోంది. భారత్-పాక్ మధ్య 2021 లో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా ద్వైపాక్షిక చర్చల ద్వారానే కుదిరిందని న్యూఢిల్లీ తెలిపింది. మూడవ పక్షం ప్రత్యేకంగా అమెరికా, ఈ ఒప్పందంలో ఏ విధమైన పాత్ర పోషించలేదని భారత్ ఖరాఖండిగా తేల్చి చెప్పింది. ఏదేమైనా ట్రంప్ తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు అమెరికా రాజకీయ వేదికలో పెద్ద చర్చకు దారితీశాయి. భారత్-పాక్ ఉద్రిక్తత వంటి సున్నితమైన అంశాలపై ఇలాంటి అతి అతిశయోక్తి వ్యాఖ్యలు సరైనవా? అనే ప్రశ్న కూడా నిపుణుల మధ్య చర్చనీయాంశమయ్యాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications