ఫిన్‌టెక్‌గా మారనున్న ‘ట్రూకాలర్’.. 2020 నుంచి క్రెడిట్ బిజినెస్

ట్రూకాలర్.. ఈ పేరు వినగానే ఓ మొబైల్‌ యాప్ గుర్తొస్తుంది. అంతేకాదు, చాలామంది వినియోగదారుల మొబైల్ ఫోన్లలో ఈ యాప్ ఉంటుంది కూడా. ఈ యాప్ ద్వారా అపరిచిత వ్యక్తుల దగ్గర్నించి వచ్చే కాల్స్, స్పామ్ కాల్స్‌ను చాలా సులువుగా గుర్తించవచ్చు. స్పామ్ కాల్స్‌ను గుర్తించడంతోపాటు పేమెంట్స్, చాట్ వంటి సేవలను కూడా ట్రూకాలర్ యాప్ తన ప్లాట్‌ఫామ్‌పై అందిస్తోంది.

అలాంటి ట్రూకాలర్ యాప్ ఇప్పుడు జనానికి అప్పులిచ్చే కంపెనీగా మారుతోంది. 2020 ప్రారంభంలో ఇండియాలో తన పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా రుణ వితరణ వ్యాపారంలోకి అడుగుపెట్టనుంది. ఇందుకోసం 'ట్రూకాలర్ పే' అప్‌డేషన్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

ఫిన్‌టెక్ కంపెనీగా ‘ట్రూకాలర్'...

ఫిన్‌టెక్ కంపెనీగా ‘ట్రూకాలర్'...

అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌తోపాటు, పలు స్పామ్ కాల్స్‌ను కనుగొనేందుకు ఉపయోగపడే ట్రూకాలర్ యాప్.. ఇప్పుడు తన యూజర్లకు వచ్చే ఏడాది అంటే.. 2020 నుంచి రుణాలు కూడా ఇవ్వబోతోంది. అంటే.. ట్రూకాలర్ త్వరలోనే ఫిన్‌టెక్ కంపెనీగా మారబోతోందన్నమాట. ఈ విషయాన్ని ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు నమి జరింగలం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇప్పటికే పరిమిత సంఖ్యలో యూజర్లపై ఈ సర్వీసులను టెస్ట్ చేశామని, వారి నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఆ యూజర్లే ట్రూకాలర్ బలం...

ఆ యూజర్లే ట్రూకాలర్ బలం...

ట్రూకాలర్‌కు ఇండియాలో రోజుకు100 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల ట్రూకాలర్ తన బ్లాగ్‌పోస్టులో పేర్కొంది.మరో అశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ట్రూకాలర్ ఉపయోగించే ప్రతి పదో యాక్టివ్ యూజర్ తన బ్యాంకు ఖాతాను ‘ట్రూకాలర్ పే'తో లింక్ చేసుకుని ఉండడం. ఇప్పుడు రుణ వితరణ రంగంలోకి ప్రవేశిస్తోన్న ట్రూకాలర్‌కు తన యూజర్లే కొండంత బలం. 2018లో ట్రూకాలర్ దేశీయ చెల్లింపుల కంపెనీ ‘చిల్లర్'ను చేజిక్కించుకుంది. ఆ తరువాత రుణ వితరణ రంగంలోకి ప్రవేశించే ప్రణాళికలను అప్పట్నించే రచిస్తూ వస్తోంది.

తొలుత దేశంలోని 22 నగరాల్లో...

తొలుత దేశంలోని 22 నగరాల్లో...

వచ్చే ఏడాది ప్రారంభంలో రుణ వితరణ సదుపాయాన్ని తన యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్న ట్రూకాలర్ పైలట్ ప్రాజెక్టు కింద దేశంలోని 22 నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. మరోవైపు 2017లోనే ట్రూకాలర్ యూపీఐ ఆధారిత ‘ట్రూకాలర్ పే' చెల్లింపుల ప్లాట్‌ఫామ్‌ను ఐసీఐసీఐ బ్యాంకు సౌజన్యంతో తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ‘ట్రూకాలర్ పే' ప్లాట్‌ఫామ్ ద్వారా ట్రూకాలర్ యూజర్లు యూపీఐ ఐడీని క్రియేట్ చేసుకుని, మొబైల్ రీచార్జ్‌లు చేసుకోవడమే కాక యూపీఐ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు నగదు కూడా బదిలీ చేయవచ్చు.

రూ.1-5 లక్షల వరకు రుణం...

రూ.1-5 లక్షల వరకు రుణం...

ట్రూకాలర్ తన యూజర్లలో అర్హులైన వ్యక్తులకు లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు రుణాలు ఇవ్వనుంది. అంతేకాకుండా, తమ వినియోగదారులకు అవసరమైన అన్ని రకాల డిజిటల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ‘ట్రూకాలర్ పే' ప్లాట్‌ఫామ్‌ను అప్‌డేట్ చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై 2 కోట్ల మంది యూజర్లు ఉంటారని, వారిలో సగం మంది టైర్ 2, టైర్ 3 నగరాలకు చెందినవారేనని ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు నమి జరింగలం పేర్కొన్నారు.

పూర్తి క్యాష్‌లెస్‌గా మారేందుకు మరోపదేళ్లు...

పూర్తి క్యాష్‌లెస్‌గా మారేందుకు మరోపదేళ్లు...

ఇండియాలో చెల్లింపులకు సంబంధించి ప్రజలు పలు రకాల డిజిటల్ పేమెంట్ ప్రొడక్ట్‌లను ఉపయోగిస్తున్నారని, అయితే ఇప్పటికీ పర్సులో క్యాష్ లేకుండా ఎవరూ బయటికి వెళ్లే పరిస్థితి లేదని, పూర్తి క్యాష్‌లెస్‌గా మారడానికి అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేసుకోవడానికి ఇండియాకు ఇంకో 10 సవత్సరాలు పడుతుందని ట్రూకాలర్ సహ వ్యవస్థాపకుడు నమి జరింగలం చెప్పారు. అయితే డిజిటల్ పేమెంట్ల వాడకం కొన్నిసార్లు తగ్గొచ్చు.. కొన్నిసార్లు పెరగొచ్చు అని వ్యాఖ్యానించారు.

ప్రొడక్ట్ అప్‌డేషన్ చాలా ముఖ్యం...

ప్రొడక్ట్ అప్‌డేషన్ చాలా ముఖ్యం...

డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన ఉత్పత్తుల అప్‌డేషన్ చాలా ముఖ్యమని, లేకుంటే పెగాసస్ తదితర హ్యాకింగ్ సాఫ్ట్‌వేర్లతో ప్రమాదం పొంచి ఉంటుందని నమి జరింగలం చెప్పారు. సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ పాచెస్, అప్లికేషన్స్ అప్‌ టూ డేట్‌గా లేకపోతే ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చని, అయితే ప్రస్తుత డిజిటల్ యుగంలో పరిస్థితి పూర్వంలా లేదని, ప్రజల్లోనూ భద్రతపై అవగాహన పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అయితే తమ ‘ట్రూకాలర్ పే' యాప్‌పై తమకు విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+