Truecaller: కాలర్ IDని గుర్తించడానికి ఎక్కువ మంది 'ట్రూకాలర్' యాప్ ని వినియోగిస్తుంటారు. స్పామ్ కాల్స్ ను నోటిఫై చేసి వాటిని బ్లాక్ చేయడం దీనిలో స్పెషాలిటీ. అయితే పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పలు కొత్త ఫీచర్లను యాప్ కు యాడ్ చేసినట్లు ట్రూకాలర్ చెబుతోంది.
గూగుల్ ప్లే మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో తక్షణమే గుర్తించగలిగే సరికొత్త ఐకాన్ తో ట్రూకాలర్ రీబ్రాండింగ్ ప్రకటించింది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఆధారిత సెర్చింగ్, యాంటీ ఫ్రాడ్ ఫీచర్ యూజర్లకు లభిస్తోందని పేర్కొంది. తద్వారా ఏదైనా నంబర్ కోసం వెతుకుతున్నప్పుడు.. లేటెస్ట్ గా మార్చిన పేరుని తక్షణమే తెలియజేస్తుందని వెల్లడించింది.

ఈ యాప్ ఆయా నంబర్లను మూడు రంగులుగా వర్గీకరిస్తుంది. సాధారణ పేరు మార్పుకు నీలం, అనుమానాస్పదంగా కనిపిస్తే పసుపు, మోసపూరిత మరియు స్కామర్ కార్యకలాపాలను గుర్తిస్తే ఎరుపు రంగు సూచిస్తూ అలర్ట్ చేస్తుంది. అండ్రాయిడ్ సహా iOS ఆపరేటింగ్ సిస్టమ్స్ కూ కంపెనీ ఈ ఫీచర్ అందించింది.
'యాప్ ద్వారా జరిగే కమ్యూనికేషన్ ను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకోసం సెర్చ్ అనుభవంతో పాటు గోప్యతను మెరుగుపరచేందుకు, మోసాలను నిరోధించేందుకు పరిష్కారాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం' అని CEO అలాన్ మామెడి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 356 మిలియన్ యూజర్లతో, గత 14 ఏళ్లుగా ఐడెంటిఫికేషన్ సొల్యూషన్స్‌లో ట్రూకాలర్ మార్కెట్ లీడర్‌గా కొనసాగుతుండటం విశేషం.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications