Truecaller: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టిస్తున్న సునామీ అంతా, ఇంతా కాదు. ప్రతి రంగంలో తన సత్తా చాటేందుకు చాపకింద నీరులా వేగంగా విస్తరిస్తూ పోతోంది. ట్రూకాలర్ ప్రవేశపట్టిన కొత్త AI ఫీచర్ మార్కెట్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ కాలర్ ఐడీ యాప్ ట్రూకాలర్ తన సేవలు మెరుగుపరచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వినియోగిస్తోంది. యూజర్ల తరపున AI అసిస్టెంట్ కాల్ చేసే విధంగా కొత్త ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. అయితే తెలియని మొబైల్ నంబర్, స్పామ్ కాల్స్ గుర్తించడంలోనూ ఇది సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది.

ఇండియాలో తన AI అసిస్టెంట్ విడుదల గురించి అధికారిక బ్లాగ్ ద్వారా ట్రూకాలర్ ప్రకటన చేసింది. వినియోగదారులు కాల్ చేయలేని సమయంలో వారికి సాయం అందించేందుకు దీనిని తీసుకొచ్చినట్లు చెప్పింది. తాజాగా కాల్ స్క్రీనింగ్ ఫీచర్ సైతం అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది.
పరిమిత సమయం తర్వాత ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఆటోమేటిక్ గా AI అసిస్టెంట్ సమాధానం చెప్తుంది. అంతే కాకుండా మాట్లేడే సంభాషణ సైతం మెసేజ్ రూపంలో ప్రదర్శిస్తూ ఉంటుంది. స్పీచ్-టు-టెక్స్ట్ టెక్నాలజీ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. కానీ ఈ ఫీచర్స్ ఉపయోగించుకోవాలంటే మాత్రం సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications