Jackpot Lottery: అందరి లాగానే అదృష్టం కలిసివస్తే బాగుంటుందని భావించిన ట్రక్ డ్రైవర్ ఓ లాటరీ టికెట్ కొన్నాడు. దాని ద్వారా రూ.1.50 లక్షలు వచ్చినట్లు భావించాడు. కానీ.. అతని అదృష్టాన్ని తానే నమ్మలేక పోయాడు. అతనికి ఏకంగా రూ.7.50 కోట్లు(ఒక మిలియన్ డాలర్లు) ప్రైజ్ మనీ వచ్చింది. అమెరికాలోని ఇల్లినాయిస్ నివాసి అయిన 48 ఏళ్ల వ్యక్తికి ఇది నిజంగా జరిగింది. ఒకసారి అతను మిచిగాన్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు.. మట్టవాన్‌లోని పెట్రోల్ స్టేషన్ నుంచి లాటరీ టికెట్ కొన్నాడు. టికెట్ కొనగానే బార్ కోడ్ స్కాన్ చేయగా తనకు రెండు వేల డాలర్ల ప్రైజ్ మనీ వచ్చిందని తాను అనుకున్నట్లు సదరు డ్రైవర్ mlive.comకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

లాటరీ ఆఫీస్ కు ఫోన్ చేసి:
అతను లాటరీని గెలుచుకున్నందుకు థ్రిల్ అయ్యాడు. కానీ.. టికెట్ వైపు మళ్లీ చూసినప్పుడు, జీవితంలోనే అతిపెద్ద ఆశ్చర్యాన్ని అందుకున్నాడు. అతను తన ట్రక్‌లోకి తిరిగి వచ్చిన తర్వాత టిక్కెట్‌ను గీకినప్పుడు ఒక మిలియన్ డాలర్ల బహుమతిని గెలుచుకున్నట్లు తెలుసుకుని నమ్మలేకపోయాడు. దీనిని ధృవీకరించుకోవటానికి లాటరీ కార్యాలయానికి కాల్ చేసిన తర్వాత, పేరు చెప్పకుండా ఉండాలని కోరుతూ ఫోన్‌ను ముగించాడు.

డబ్బు అందుకున్న ట్రక్ డ్రైవర్:
సదరు ట్రక్ డ్రైవర్ ఇటీవల 6,93,000 డాలర్లను సెటిల్‌మెంట్‌గా అందుకున్నాడు. దానితో కొత్త ట్రక్కును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దీనికి తోడు కొంత మెుత్తాన్ని సేవ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు అతను వెల్లడించాడు. అయితే.. ఊహించని లాటరీ విజయం గురించి ఆన్‌లైన్‌లో కథనం కనిపించడం ఇదే మొదటిసారి కాదు. ఈ నెల ప్రారంభంలో US వ్యక్తి రూ.4.50 కోట్ల జాక్ పాట్ తగిలింది. కానీ అతడు ఆ సమయంలో 600 డాలర్లు వచ్చాయని పొరబడ్డాడు. ఇదే క్రమంలో నార్త్ కరోలినాలో ఒక వ్యక్తి మినీ మార్ట్ లో కొన్న ది క్యాష్ ఫాస్ట్ ప్లే టిక్కెట్టుకు దాదాపు రూ.4.60 కోట్ల ప్రైజ్ మనీ వచ్చింది.

ఇతరులకు విరాళం:
ఆ వ్యక్తి తన 600 డాలర్ల రివార్డును తీసుకోవడానికి లాటరీ కార్యాలయానికి వెళ్లగా.. నిజంగా జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడని తెలుసుకున్నాడు. ఊహించని జాక్‌పాట్‌కు ఆ వ్యక్తి మొదటిసారిగా వార్త తెలుసుకున్నప్పుడు "నేను నిజంగా జాక్‌పాట్ కొట్టే అవకాశం లేదు" అని అన్నాడు. ఈ ప్రైజ్ మనీతో ఇల్లు, వాహనం కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అతను తనకు వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని పొరుగువారికి విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications