స్టాక్ మార్కెట్లో ఉహించిన దాని కంటే ఒకోసారి ఉహించనివే ఎక్కువ జరుగుతాయని మరోసారి తెలుస్తుంది. గత పది రోజులుగా స్టాక్ మార్కెట్ తీవ్ర నష్టాలకి గురైనప్పటికీ కొన్ని పెన్నీ స్టాక్స్ మాత్రం అదరగొడుతూ మంచి రిటర్న్స్ ఇస్తూ ఇన్వెస్టలను కుష్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఇలాంటి సమయంలో గతం కంటే బాగా పనితీరు కనబరిచాయి. ఈ వారం స్టాక్ మార్కెట్ చివరి ట్రేడింగ్ రోజున మరోసారి పెట్టుబడిదారులను నిరాశపరిచింది. అయితే ట్రేడింగ్ సమయంలో రోజంతా హెచ్చుతగ్గులకు గురైంది. చివరికి సెన్సెక్స్ నష్టాలతో ముగియగా, నిఫ్టీ స్వల్ప లాభంతో ముగిసింది. మరోవైపు ఒక స్టాక్ పెట్టుబడిదారులను సంతోషపరిచింది. స్టాక్ మార్కెట్ పతనం ఉన్నప్పటికీ ఈ షేర్ 15 శాతం వృద్ధి సాధించింది. ఈ షేర్ పేరు త్రివేణి టర్బైన్ లిమిటెడ్. ఇవాళ శుక్రవారం ఈ స్టాక్ రూ.546.90 వద్ద మొదలై ట్రేడింగ్ మొత్తంలో రూ.639కి చేరుకుంది. అయితే తరువాత కొంతవరకు పడిపోయింది. కానీ చివరికి 15 శాతం లాభంతో రూ.615.40 వద్ద ముగిసింది. అయితే ఈ వారం రోజుల్లో ఈ స్టాక్ 27 శాతం లాభపడింది.
షేర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే : ఈ స్టాక్ గత 6 నెలల్లో పెట్టుబడిదారులను నిరాశపరిచింది. కానీ 6 నెలల క్రితం సెప్టెంబర్ 9న ఈ షేర్ ధర రూ. 746, ఇప్పుడు రూ.615.40. ఇలాంటి పరిస్థితిలో ఈ 6 నెలల్లో పెట్టుబడిదారులకు 17 శాతానికి పైగా నష్టాన్ని ఇచ్చింది. అయితే, ఒక సంవత్సరం రిటర్న్ మనం పరిశీలిస్తే మాత్రం పెట్టుబడిదారులను సంతోష పెట్టింది అని చేప్పవచ్చు. ఒక సంవత్సరంలో దీని రాబడి 25 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఇక ఒక సంవత్సరం క్రితం దీని ధర చూస్తే దాదాపు రూ.485గా ఉండేది.

లక్ష రూపాయల నుండి 7 లక్షల సంపాదన: ఈ స్టాక్ దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని ఇచ్చింది. అంటే 5 సంవత్సరాలలో దాదాపు 600 శాతం రిటర్న్ ఇచ్చింది. 5 సంవత్సరాల క్రితం దీని ధర రూ. 89. ఇప్పుడు రూ.615.40. పోల్చి చూస్తే దీని 5 సంవత్సరాల రాబడి 591 శాతం. మీరు 5 సంవత్సరాల క్రితం అందులో రూ.1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే ఇప్పుడు ఆ మొత్తం రూ.7 లక్షలుగా మారి ఉండేది. అంటే లక్ష పెట్టుబడి పెడితే 5 సంవత్సరాలలో రూ. 6 లక్షల లాభం వచ్చేది.
కంపెనీ ఏం చేస్తుందంటే : ఈ కంపెనీ 100 మెగావాట్ల విద్యుత్ (MWe) వరకు పారిశ్రామిక స్టీమ్ టర్బైన్లను తయారు చేస్తుంది. ఈ కంపెనీ 20కి పైగా పరిశ్రమలలో 6,000కి పైగా స్టీమ్ టర్బైన్లను ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ 80కి పైగా దేశాలలో కొనసాగుతుంది. BSE అఫీషియల్ వెబ్‌సైట్ ప్రకారం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.19,562.15 కోట్లు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications