Multibagger Stock: లక్షను రూ.40 లక్షలు చేసిన మల్టీబ్యాగర్.. మీరూ కొన్నారా..

Multibagger Stock: కొన్ని పెన్నీ స్టాక్స్ మాదిరిగా కనిపించినప్పటికీ.. బలమైన వ్యాపారం, భవిష్యత్తు వ్యూహాలతో ముందుకు సాగుతుంటాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు ఊహించని రాబడులను అందించి వారిని లక్షాధికారులుగా మారుస్తుంటాయి.

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించిన మల్టీబ్యాగర్ ట్రేడెంట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. దీర్ఘకాలంలో ఈ స్టాక్ ఇన్వెస్టర్ల తలరాతను మార్చి వారికి 3600 శాతానికి పైగా రాబడులను అందించింది. 10 ఏళ్ల కిందట కేవలం 88 పైసలు మాత్రమే ఉన్న స్టాక్ ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.33.70 వద్ద ఉంది. గడచిన ఐదేళ్ల కాలంలో స్టాక్ తన పెట్టుబడిదారులకు 326 శాతం రాబడిని అందించింది.

Trident stock

ఎవరైనా ఇన్వెస్టర్ పదేళ్ల కిందట కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి, దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే ప్రస్తుతం మాక్కట్లో దాని విలువ రూ.40 లక్షలకు చేరుకుని ఉండేది. ప్రస్తుతం ట్రైడెంట్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్ రూ.17,000 కోట్లుగా ఉంది. కంపెనీ వస్త్రాలు, కాగితం, నూలు, రసాయనాల తయారీకి సంబంధించిన రంగాల్లో వ్యాపారాలను నిర్వహిస్తోంది. కంపెనీ తన ఆదాయంలో ఎక్కువ శాతాన్ని ఎగుమతుల నుంచే పొందుతోంది.

కంపెనీలో ప్రమోటర్లు 73.19% మెజారిటీ వాటాను కలిగి ఉన్నారు. మిగిలిన వాటా పబ్లిక్ హోల్డర్ల చేతిలో ఉంది. వీరిలో దేశీయ, విదేశీ పెట్టుబడిదారులతో పాటు మ్యూచువల్ ఫండ్స్ కూడా వాటాలను కలిగి ఉన్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కంపెనీలో దాదాపు 18% వాటా కలిగి ఉన్నారు. FY23లో కంపెనీ ఆదాయం రూ.6,332 కోట్లుగా ఉండగా.. నికర లాభం రూ.441 కోట్లుగా నమోదైంది.

Trident stock

Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+