సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (SAT)లో ఫ్యూచర్ గ్రూప్‌కు ఊరట లభించింది. ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకులు కిషోర్ బియానీ, ఆయన సోదరుడు అనిల్ బియానీ, ఫ్యూచర్ కార్పోరేట్ రిసోర్సెస్ లిమిటెడ్ సంస్థలు సెక్యూరిటీ మార్కెట్లకు ఏడాది పాటు దూరంగా ఉండాలని ఫిబ్రవరి 3న ఆదేశించింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు రావడంతో సెబి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ షేర్ల క్రయవిక్రయాలు రెండేళ్ల పాటు చేయకూడదని ఆదేశించింది. దీనిపై ఫ్యూచర్ గ్రూప్ SATను ఆశ్రయించింది. ఇక్కడ ఫ్యూచర్ గ్రూప్‌కు ఊరట లభించింది.
నిన్న (ఫిబ్రవరి 15) వాదనలు జరిగాయి. ఫ్యూచర్ గ్రూప్ తరఫున సుందరేశన్ వాదనలు వినిపించారు. 2017లో కంపెనీ పునర్య్వస్థీకరణ జరిగిందని, షేర్ల కొనుగోలు మార్చిలో జరిగిందని శాట్ తెలిపారు. సంస్థ హోంఫర్నిషింగ్ వ్యాపారం వ్యవస్థీకరణ అంశం 2016 నుండి ప్రజలకు తెలిసిందేనని పేర్కొన్నారు. వాదనల అనంతరం సెబి ఆదేశాలపై SAT స్టే విధించింది. అయితే ఫ్యూచర్ గ్రూప్ రూ.11 కోట్లను డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఈ కేసును ఏప్రిల్ 12వ తేదీన విచారించనుంది.

కంపెనీకి చెందిన కొన్ని వ్యాపారాల విభజనకు సంబంధించి, ధరలపై ప్రభావం చూపే అప్రచురిత సమాచారం ఆధారంగా 2017లో కొంతమంది వ్యక్తులు, సంస్థలు వ్యక్తులు, సంస్థలు ట్రేడింగ్ నిర్వహించారా లేదా అనే అంశంపై సెబి దర్యాఫ్తు చేపట్టింది. వీరు ట్రేడింగ్ జరిపి చట్ట వ్యతిరేకంగా లాభాలు పొందినట్లు తేలడంతో ఈ చర్యలు చేపట్టింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications