Trent: ఒక్క రోజే 12 పడిపోయిన టాటా గ్రూప్ స్టాక్.. లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు..!
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు చాలా రిస్క్ తో కూడుకున్నవి. ఒక స్టాక్ పెరుగుతుందని పెట్టుబడి పెడితే అది పడిపోయే అవకాశం. అప్పటి వరకు మంచి పేరున్న కంపెనీ ఒక్క రోజులో ఆగమైపోతుంది. తాజాగా టాటా గ్రూప్ రిటైల్ విభాగమైన ట్రెంట్ లిమిటెడ్ షేర్లు భారీగా పడిపోయాయి. మంగళవారం ట్రేడింగ్ సెషన్ లో ట్రెంట్ షేర్లు 12 శాతం పతనమయ్యాయి. సోమవారం సాయంత్రం కంపెనీ ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి అప్డేట్ ఇచ్చింది. కంపెనీ స్టాండ్అలోన్ గత సంవత్సరంతో పోలిస్తే 19 శాతం పెరిగింది. అందుకే ఈ రోజు స్టాక్ ఒత్తిడి కనిపించింది.
కంపెనీ ఈ త్రైమాసికంలో కూడా కొత్త షో రూములు ఓపెన్ చేసింది. 2026 జూన్ 30 నాటికి దాని మొత్తం స్టోర్ల సంఖ్య 1,312కి చేరుకుంది. ఇందులో 301 వెస్ట్‌సైడ్ స్టోర్లు, 982 జూడియో స్టోర్లు ఉన్నాయి. జూడియో స్టోర్లలో 7 యూఏఈలో ఉన్నాయి. ఇతర లైఫ్‌స్టైల్ కాన్సెప్ట్‌లకు చెందిన 29 స్టోర్లు ఉన్నాయి. ఏప్రిల్-జూన్ లో కొత్తగా 20 స్టోర్లను తెరిచింది. వీటిలో ఒక వెస్ట్‌సైడ్ అవుట్‌లెట్, 19 జూడియో స్టోర్లు ఉన్నాయి. కంపెనీ యొక్క 19 శాతం వార్షిక ఆదాయ వృద్ధి అనేది మార్కెట్ అంచనాలకు తక్కువగా ఉంది. మార్కెట్ అంచనాలు 20-25 శాతం మధ్యలో ఉంటాయని భావించారు. అందుకే ఈ రోజు ఆ కంపెనీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

జూన్ లో జరిగిన ట్రెంట్ 74వ వార్షిక సర్వసభ్య సమావేశం ఛైర్మన్‌గానోయెల్ టాటా మాట్లాడారు. బెంగళూరులోని ఒకే ఒక్క స్టోర్‌తో ప్రారంభమైన టాటా రిటైల్ సంస్థను భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్, జీవనశైలి దిగ్గజంగా తీర్చిదిద్దిన తన చారిత్రాత్మక పదవీకాలానికి ఇది ముగింపు పలుకుతుందని అన్నారు. కాగా నోయెల్ త్వరలోనే ఛైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నారు. టాటా సన్స్‌లో అతిపెద్ద వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్‌కు ఛైర్మన్‌గా కూడా ఉన్న నోయెల్ టాటా, ఈ ఏడాది నవంబర్‌లో 70 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. కంపెనీల చట్టం 2013 ప్రకారం, 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ మేనేజింగ్ డైరెక్టర్ లేదా పూర్తికాలపు డైరెక్టర్‌ను నియమించడం గానీ, వారు ఉద్యోగంలో కొనసాగడం గానీ కుదరదు.
ట్రెంట్ లిమిటెడ్ అనేది ప్రముఖ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ రిటైలర్‌లలో ఒకటి. ఈ కంపెనీ వెస్ట్‌సైడ్, జూడియో, స్టార్ బజార్ అనేక ఇతర లైఫ్‌స్టైల్ కాన్సెప్ట్‌లతో సహా విభిన్న రకాల రిటైల్ ఫార్మాట్‌లను నిర్వహిస్తుంది. ట్రెంట్ గతంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. పెట్టుబడిదారులను కోటీశ్వరులను చేసింది. 2020 జూన్ లో ట్రెట్ లిమిటెడ్ స్టాక్ రూ. 379 ఉండగా.. 2024 అక్టోబర్ లో రూ.5,178 కు చేరుకుంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తుంది. జూలై 7 కంపెనీ షేర్లు రూ.2,921 వద్ద స్థిర పడ్డాయి.


Click it and Unblock the Notifications