బెంగళూరులో జరిగిన ఓ పెళ్లి వేడుకలో సుధా మూర్తి డ్యా్న్స్ చేసిన వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది. సుధామూర్తితోపాటు బయోకాన్ లిమిటెడ్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా కూడా డ్యాన్స్ చేశారు. డెబ్బైల వయసులో ఉన్న ఇద్దరు మహిళలు బరాత్ సందర్భంగా డప్పులకు అనుగుణంగా స్టెప్పులేస్తూ కనిపించారు. చాలా ఉత్సాహభరితంగా డ్యాన్స్ చేసి అక్కడి వాతావరణాన్నే ఆహ్లాదభరితంగా మార్చేశారు వీళ్లిద్దరు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. "ఇద్దరు శక్తివంతమైన మహిళలు పిల్లల్లా డ్యాన్స్ చేయడం చాలా బాగుంది" అని కొందరు.. "ఆ ఇద్దరు మహిళలు నిజంగా ఇన్‌స్పిరేషన్" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఈ ఇద్దరు మహిళలు దశాబ్దాలుగా వారివారి రంగాల్లో సక్సెస్ అవ్వడంతోపాటు ఎంతోమందికి ఇన్ స్పిరేషన్ గా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక అరుదైన సంఘటనతో మరోసారి ఇద్దరి పేరు మారుమ్రోగిపోయింది. వయసు, ఫేమ్ తో పని లేకుండా ఆనందాన్ని ఎంజాయ్ చేయడం ఎలాగో వీరిని చూసి నేర్చుకోవాలంటున్నారు నెటిజన్లు.
ప్రముఖులు కూడా..
బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్‌లో జరిగిన ఈ మ్యారేజ్ రిసెప్షన్‌కి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ సహా పలువులు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. శివకుమార్ ఎక్స్ వేదికగా పెళ్లి ఫొటోలను షేర్ చేసి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రేమ, ఐక్యతకు సంబంధించిన వేడుకగా ఆయన వర్ణించారు.
వధూవరులు వీళ్లే..
ఈ వివాహ వేడుక కిరణ్ మజుందార్ షా మేనల్లుడు ఎరిక్ మజుందార్ది. ఈయన ఎరిక్ ఆష్లే పౌర్ణిమను వివాహ చేసుకున్నారు. ఈ పెళ్లి రిసెప్షన్ ఇటీవలే బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్‌లో గ్రాండ్‌గా జరిగింది.ఈ వేడులో వరుడు ఎరిక్ మజుందార్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈయన కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటింగ్ & మ్యాథమెటికల్ సైన్సెస్, ఎకనామిక్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుండి EECS లో బ్యాచిలర్స్, బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి PhD పట్టా పొందాడు. ప్రస్తుతం ఆయన బయోకాన్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఇక వధువు విషయానికొస్తే.. ఆమె పేరు ఆష్లే పౌర్ణమ్. ఈమె వైద్యురాలిగా, కంప్యూటేషనల్ బయాలజిస్ట్‌గా పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications