మనలో చాలామంది "మంచి డిగ్రీ ఉంటేనే సెటిల్ అవుతాం" అని నమ్ముతుంటారు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ (trending) లో ఉన్న ఒక యువకుడి కథ చూస్తే.. సక్సెస్‌కు కావాల్సింది సర్టిఫికెట్లు కాదు, సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలని అర్థమవుతుంది. కేవలం రూ. 21,000 జీతంతో మొదలుపెట్టి, నేడు ఏకంగా రూ. 60 కోట్ల డీల్స్ క్లోజ్ చేసే స్థాయికి ఎదిగిన ఒక డెలివరీ బాయ్ సక్సెస్ జర్నీ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

కష్టాల కడలిలో తొలి అడుగులు
కరోనా కష్టకాలంలో ఉద్యోగ మార్కెట్ అంతా అతలాకుతలమైన వేళ, ఆ యువకుడికి వేరే ఆప్షన్ లేక ఒక ఫైనాన్షియల్ సంస్థలో 'డాక్యుమెంట్ ఎగ్జిక్యూటివ్'గా చేరాడు. పేరు వినడానికి చాలా రిచ్‌గా ఉన్నా నిజానికి అది ఒక డెలివరీ బాయ్ లాంటి ఉద్యోగం. ఢిల్లీలో మండుతున్న ఎండలు, వణికించే చలిని లెక్కచేయకుండా క్లయింట్ల దగ్గర నుంచి ఫైళ్లు సేకరించి బ్యాంకులకు అందించడమే అతని పని. నాలుగున్నరేళ్లు కష్టపడితే అతని జీతం రూ. 18,000 నుంచి కేవలం రూ. 21,000 కి మాత్రమే పెరిగింది.
కన్నీళ్ల నుంచి పుట్టిన కసి
"ఐదేళ్ల క్రితం బ్యాగులో డాక్యుమెంట్లు పెట్టుకుని వానలో తడుస్తూ నిలబడ్డాను. కనీసం ఒక మంచి రెయిన్ కోట్ కొనుక్కునే స్తోమత కూడా లేక ఏడ్చాను" అంటూ అతను తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ కష్టమే అతడిలో కసిని పెంచింది. ఈ "సిస్టమ్" లో ఉండి కష్టపడితే కేవలం జీతం మాత్రమే పెరుగుతుందని, సిస్టమ్ ను దాటి ఆలోచిస్తేనే ఎదుగుదల ఉంటుందని అతను గ్రహించాడు.
టర్నింగ్ పాయింట్: ఆ ఒక్క పరిచయం జీవితాన్నే మార్చేసింది!
ఒక ఛార్టర్డ్ అకౌంటెంట్ (CA) తో ఏర్పడిన పరిచయం అతని జీవితాన్ని మలుపు తిప్పింది. స్వతంత్రంగా ఫండింగ్ కేసులు తీసుకురావాలని, వచ్చిన లాభాన్ని 50-50 నిష్పత్తిలో పంచుకుందామని ఆ CA ఆఫర్ ఇచ్చాడు. ఇది గమనించిన ఆ యువకుడు, ఫీల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు తను సంపాదించిన నెట్‌వర్క్ ను వాడుకోవడం మొదలుపెట్టాడు. మెల్లగా లోన్ ప్రాసెస్, బ్యాంకింగ్ రూల్స్, ఫైనాన్షియల్ కన్సల్టెన్సీలో పట్టు సాధించాడు.
నేడు వందల కోట్ల టర్నోవర్
ప్రస్తుతం అతను కేవలం కాగితాలు మోసే వ్యక్తి కాదు, ఒక సక్సెస్‌ఫుల్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ప్రాజెక్ట్ ఫండింగ్, ఈక్విటీ ఫండింగ్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్ (M&A) వంటి హై-టికెట్ డీల్స్ నిర్వహిస్తున్నాడు. తాజాగా రూ. 60 కోట్ల డీల్ క్లోజ్ చేయడమే కాకుండా హోటళ్లు, హాస్పిటల్స్ కొనుగోలు, విక్రయాల రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. ఇప్పుడు అతని వార్షిక ఆదాయం రూ. 1-2 కోట్ల మధ్యలో ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు.
సోషల్ మీడియా రెస్పాన్స్
రెడిట్ (Reddit) వేదికగా అతను పంచుకున్న ఈ స్టోరీ ప్రస్తుతం ఇంటర్నెట్ లో విపరీతంగా trending అవుతోంది. "మార్కెట్ కు నీ డిగ్రీతో పనిలేదు, నువ్వు పనిని ఎంత పర్ఫెక్ట్ గా డెలివరీ చేస్తావనేదే ముఖ్యం" అన్న అతని మాటలు యువతకు పెద్ద ఇన్‌స్పిరేషన్ గా నిలుస్తున్నాయి. నెటిజన్లు "అద్భుతమైన జర్నీ బ్రదర్.. నీ కష్టం ఇతరులకు స్ఫూర్తి" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.
ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే.. చేస్తున్న పని చిన్నదైనా, పెద్దదైనా అందులో ఉన్న మెళకువలను గమనిస్తూ, అవకాశాల కోసం వెతకాలి. సరైన సమయంలో రిస్క్ తీసుకుంటే, సామాన్య ఉద్యోగి కూడా సామ్రాజ్యాన్ని నిర్మించగలడని ఈ యువకుడు నిరూపించాడు.
More From GoodReturns

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Success story: రూ. 600 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టాడు!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications