డొనాల్డ్ ట్రంప్ సర్కారు అక్టోబర్ 1 నుంచి "వీసా ఇంటిగ్రిటీ ఫీజు" USD 250 (సుమారు రూ.22,000) వసూలు చేయబోతోంది. అమెరికా వీసా మొత్తం ఖర్చు USD 442 (సుమారు రూ. 40,000) వరకు పెరుగుతుంది.

ఇది కేవలం ఖర్చు పెరుగుదల మాత్రమే కాదు, చాలా మందికి USA డ్రీమ్ దూరమవుతున్నట్టు. ఇప్పటికే గత ఏడాది కంటే అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య 2.5% తగ్గింది, చదువుకోడానికి వెళ్తున్న విద్యార్థులు కూడా 18% తగ్గిపోయారు. ఈ కొత్త ఫీజు పెంపు వలన ఈ నంబర్లు ఇంకాస్త పడిపోవడం ఖాయం.
ఎందుకింత ప్రభావం?
1. ఖర్చు భారం పెరగడం - సాధారణ మధ్యతరగతి కుటుంబానికి రూ.40,000 వీసా ఫీజు అంటే చాలా పెద్ద మొత్తం. అంతే కాదు, విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు, లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌తో కలిపి ఇది మరింత భారమవుతుంది.
2. టూరిజం & బిజినెస్‌పై బ్రేక్- ట్రావెల్ ఇండస్ట్రీ కూడా ఆందోళనలో ఉంది. ఇప్పటికే అమెరికాకు వెళ్తున్న విదేశీ టూరిస్టులు 3.1% తగ్గిపోయారు. 2026 FIFA వరల్డ్‌కప్, 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ వంటి ఈవెంట్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.
3. వీసా బాండ్స్ కొత్త తలనొప్పి- ట్రంప్ ప్రభుత్వం మరో 'USD 15,000 వీసా బాండ్' ప్లాన్ కూడా తెచ్చింది. అంటే టూరిస్టులు, విద్యార్థులు, మీడియా పర్సనల్ ఎవరు అయినా అమెరికాకు వెళ్ళాలంటే అదనంగా ఈ డబ్బు కూడా బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ఓవర్‌స్టే చేయకుండా ఉండేందుకు ఈ రూల్ తీసుకొచ్చారు.
ఇకపై అమెరికా వెళ్లడం అంటే కేవలం డ్రీమ్ కాదు, ఖరీదైన కాస్ట్లీ డ్రీమ్ గా మారింది. కొత్త ఫీజులు, బాండ్స్ వలన అక్కడ చదవాలని ప్లాన్ చేసే విద్యార్థుల ఖర్చులు రెట్టింపు అవుతాయి. బిజినెస్ మీటింగ్స్, కాన్ఫరెన్సులకు వెళ్ళేవారికీ అదనపు బరువు పడుతుంది. ఇక సాధారణంగా టూరిస్టుగా వెళ్లాలని అనుకునేవారు కూడా "USA ట్రిప్"పై మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది..
ఇక చాలా మంది స్టూడెంట్స్, టూరిస్టులు అమెరికా కన్నా కెనడా, ఆస్ట్రేలియా, UK, యూరప్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఖర్చులు తక్కువగా ఉండటం, స్టూడెంట్ ఫ్రెండ్లీ పాలసీలు ఉండటం వల్ల వాటి పాపులారిటీ పెరగవచ్చు. అమెరికా "హై ఫీజు - హై రెస్ట్రిక్షన్స్" పాలసీ వలన, గ్లోబల్ ట్రావెలర్స్ రూట్ మార్చడం సాధ్యమే.
వీసా ఫీజులు పెరగడమే కాదు, లివింగ్ ఎక్స్‌పెన్సెస్ కూడా అమెరికాలో పెరుగుతున్నాయి. రూమ్ రెంట్, గ్రాసరీస్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా అన్నీ పెరిగిపోయాయి. అంటే చదువు కోసమే కాకుండా రోజువారీ ఖర్చులు కూడా మధ్యతరగతి స్టూడెంట్స్‌కి బరువుగా మారుతున్నాయి. ఇంతవరకు స్టూడెంట్స్ "US మాత్రమే" అని ఫిక్స్ అయ్యేవారు. కానీ ఇప్పుడు "కెనడా PR ఈజీగా వస్తుంది", "ఆస్ట్రేలియాలో వర్క్ అవర్స్ ఎక్కువగా దొరుకుతాయి" అనేది స్ట్రాంగ్ పాయింట్ అవుతోంది. దీంతో అమెరికా టాప్ టాలెంట్‌ను మిస్సయ్యే ఛాన్స్ ఉంది.
మొత్తానికి, ఇప్పటివరకు "అమెరికా వెళ్తా" అనడం ఒక కల లాంటిది. కానీ ఇప్పుడు అది "డబ్బు ఉన్నవాళ్లే వెళ్తారు" అనే రియాలిటీగా మారిపోతోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications