IPO News: ఐపీవో పేపర్లు ఉపసంహరించుకున్న ఓయో.. అందుకోసం వాయిదా..

OYO IPO: ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలోకి వరుసగా వస్తున్న ఐపీవోలతో ఇన్వెస్టర్లు చాలా బిజీబిజీగా గడుపుతున్నారు. ఒకపక్క ఎన్నికల సందర్భంగా గెలుపు అంచనాల ఆధారంగా కొన్ని రంగాల్లోని కంపెనీలపై బెట్టింగ్ వేస్తున్న వారు మరోపక్క ఐపీవోలతోనూ ఆట కొనసాగిస్తున్నారు.

ఈ క్రమంలోనే Oravel Stays యాజమాన్యంలో ట్రావెల్ టెక్ ప్లాట్ ఫారమ్ ఓయో తన ఐపీవో ప్రణాళికలను ప్రస్తుతానికి వెనక్కి తీసుకుంది. ఇప్పటికే సెబీ వద్ద ఇచ్చిన దరఖాస్తు పేపర్లను వెనక్కి తీసుకుంది. సాఫ్ట్ బ్యాంక్ మద్దతుతో కొనసాగుతున్న సంస్థ డాలర్ బాండ్ల విక్రయం ద్వారా 450 మిలియన్ డాలర్లను సమీకరించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఇది పూర్తైన తర్వాత ముసాయిదా పేపర్లను తిరిగి దాఖలు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

Travel Tech Platform OYO withdraws DRHP with SEBI planning to refile IPO application later

అమెరికాకు చెందిన జేపీ మోర్గాన్ సంవత్సరానికి 9-10 శాతం వడ్డీ రేటుతో డాలర్ బాండ్ల విక్రయం ద్వారా రీఫైనాన్సింగ్ కోసం ప్రధాన బ్యాంకర్‌గా ఉండనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. OYO తాజా రీఫైనాన్సింగ్ కోసం దాని ప్రస్తుత DRHPని ఉపసంహరించుకోవడానికి క్యాపిటల్ మార్కెట్స్ వాచ్‌డాగ్‌తో తన దరఖాస్తును వెనక్కి తీసుకుంది. బాండ్ ఇష్యూ తర్వాత ఓయో మాతృసంస్థ ఓర్వెల్ స్టేస్ తిరిగి పేపర్లను దాఖలు చేయాలని చూస్తోంది. దీనికి ముందు బైబ్యాక్ ప్రక్రియ ద్వారా రూ.1,620 కోట్ల రుణంలో గణనీయమైన భాగాన్ని ప్రీపెయిడ్ చేసింది.

రీఫైనాన్సింగ్ నిర్ణయం OYO ఆర్థిక నివేదికల్లో భౌతిక మార్పులకు దారి తీస్తుంది. అందువల్ల ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం అది రెగ్యులేటర్‌తో తన ఫైలింగ్‌లను సవరించాల్సి ఉంటుంది. అందువల్ల ప్రస్తుత ఆర్థికాంశాలతో IPO ఆమోదాన్ని కొనసాగించడం సమంజసం కానందున ఐపీవో దరఖాస్తున్న ఉపసంహరించుకున్నట్లు వెల్లడైంది. సెప్టెంబర్ 2021లో ఓయో రూ.8,430 కోట్ల ఐపీవో కోసం సెబీ దగ్గర సంబంధిత పత్రాలను దాఖలు చేసింది. అప్పటి అస్థిర మార్కెట్ పరిస్థితుల కారణంగా ఐపీవో ఆలస్యమైన సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+