Hyderabad: హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. సిటీకి నాలుగు దిక్కుల్లో ఆధునిక బస్ టెర్మినళ్లు..
హైదరాబాద్ లో రోజు రోజుకు ట్రాఫిక్ భారీగా పెరిగిపోతోంది. దీంతో ప్రభుత్వం ట్రాఫిక్ నియంత్రించడానికి అనే ప్రయత్నాలు చేస్తోంది. ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మిస్తోంది. అలాగే డే టైమ్ లో హెవీ వెహికిల్స్ ను సిటీలోకి రాకుండా చూసుకుంటుంది. అయినప్పటికీ ట్రాఫిక్ తగ్గడం లేదు. ఆర్టీసీతో పాటు ప్రైవేట్ వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆర్టీసీ సిటీ బస్సులు, అలాగే రూట్ బస్సులు వల్ల ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూట్ బస్సులు సిటీలోకి రాకుండా నగర శివారుల్లోనే భారీగా బస్ టెర్మినళ్లు నిర్మించాలని భావిస్తోంది. హైదరాబాద్ నగరానికి నలువైపులా ఆధునిక బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
గాజులరామారం, శంషాబాద్, ఎల్బీనగర్, ఘట్కేసర్ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వివరించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు వైపు నుంచి హైదరాబాద్‌లోకి వచ్చే దూరప్రాంత, అంతర్ జిల్లా, అంతర్రాష్ట్ర బస్సులను నగరంలోని అంతర్గత ప్రాంతాల్లోకి రాకుండా ఆయా దిశల్లో ఏర్పాటు చేసే టెర్మినల్స్ వరకు మాత్రమే నడిపించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పొన్నం వివరించారు. విమానాశ్రయం వైపు వెళ్లే బస్సులు, హైదరాబాద్‌కు వచ్చే అంతర్‌జిల్లా బస్సులు కూడా అవసరాన్ని బట్టి నిర్దేశిత టెర్మినల్స్ వద్దే నిలిపివేశాల చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

బస్ టెర్మినల్ నుంచి ప్రయాణికులను నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించే విధంగా లాస్ట్ మైల్ కనెక్టివిటీని బలోపేతం చేస్తామని తెలిపారు. టెర్మినల్స్ నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునేలా సిటీ ఆర్టీసీ బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలను సమన్వయం చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీంతో నగరంలోకి వచ్చే ప్రయాణికులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రజా రవాణా అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ప్రైవేట్ బస్సులు ఇష్టానుసారంగా పార్కింగ్ చేయడం, రాత్రి సమయాల్లో రోడ్లపైకి పెద్ద సంఖ్యలో రావడం వల్ల ట్రాఫిక్ రద్దీతో పాటు కాలుష్యం కూడా పెరుగుతోందని మంత్రి గుర్తు చేశారు.
ఈ సమస్యకు పరిష్కారంగా ప్రైవేట్ బస్సులను కూడా నిర్దేశిత బస్ టెర్మినల్స్ ద్వారా నిర్వహించే విధానంపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. అవసరమైన నిబంధనల మేరకు యూజర్ ఛార్జీలు వసూలు చేస్తూ టెర్మినల్స్‌ను వినియోగించుకునే విధానాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు, ఆర్టీసీ దూరప్రాంత బస్సులు నగరంలోని రద్దీ ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా టెర్మినల్స్ వరకు మాత్రమే నడిపించే విధానం అమలులోకి వస్తే నగర ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉన్నట్లు పొన్నం అంచనా వేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
