రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వచ్చే నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాన్నాళ్ల తర్వాత రైల్వే టికెట్ ఛార్జీలు పెరగబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. రైల్వే బోర్డు అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. పెరిగిన ధరలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మరి ఎంత పెరగనుంది. ఎన్ని కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉంది వంటి వివరాలపై ఇంకా అధికారిక సమాచారం లేనప్పటికీ పెరుగుదల మాత్రం ఉంటుందని కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక వర్గాలు నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. సాధారణ మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ల (నాన్-ఏసీ) ఛార్జీలు కిలోమీటరుకు 1 పైసా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏసీ తరగతిలో ప్రయాణించేవారు కిలోమీటరుకు 2 పైసలు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వేయి కిలోమీటర్లు దాటితే ఎక్కువగా రూ.20 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పెరుగుదల చాలా తక్కువే అయినప్పటికీ మీ జేబులపై ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయి.

సెకండ్ క్లాస్ లో 500 కిలోమీటర్లు ప్రయాణించిన వారికి ఎటువంటి ఛార్జీలు విధించబోమని ఇండియన్ రైల్వే స్పష్టం చేసింది. 500 కి. మీ ప్రయాణం దాటితే..అరపైసా ఛార్జీ పెరుగుతుంది. దీని ప్రకారం.. 1000 కి.మీ ప్రయాణం చేసే ప్రయాణికులపై రూ. 2. 50 పైసలు భారం పడనుంది. అలాగే సబర్సన్ రైళ్లలో ప్రయాణించేవారికి ఎటువంటి ఛార్జీల పెంపు ఉండదు.
ఇదిలా ఉంటే తత్కాల్ టికెట్ బుకింగ్ కు సంబంధించి రైల్వే శాఖ కొత్త నిబంధనలు తీసుకువచ్చిన సంగతి విదితమే. జూలై 1, 2025 నుండి తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని కొత్త నియమాల్లో పేర్కొంది. రైల్వే మంత్రిత్వ శాఖ జూన్ 10, 2025న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సామాన్యులకు కూడా టికెట్ల అందే లక్ష్యంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు రైల్వే శాఖ నివేదికలో పేర్కొంది.
IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) వెబ్‌సైట్ లేదా యాప్ నుండి తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఆధార్ కార్డు అవసరం. మీరు ఆధార్ కార్డు లేకుండా ఎటువంటి తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోలేరని రైల్వే శాఖ ఉత్తర్వులో పేర్కొంది. దీంతో పాటు మరొక నిబంధనను కూడా పేర్కొంది. వచ్చే నెల 15 (జూలై 15) నుంచి తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ కార్డుతో కూడిన ఓటీపీ అవసరమని పేర్కొంది. ఆధార్ కార్డుకు లింకైన మొబైల్ నంబర్ కు ఈ ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తేనే తత్కాల్ టికెట్లు బుక్ అవుతాయని స్పష్టం చేసింది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications