రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్! పెరిగిన రైలు టికెట్ ధరలు! తిరుపతికి టికెట్ ధర ఎంతంటే..
రైల్వే ప్రయాణికులకు షాక్! ఈరోజు (డిసెంబర్ 26) నుంచి ట్రైన్ టికెట్ ధరలు (train ticket prices) పెరుగుతున్నాయి. ఏయే రూట్లలో ఎంత పెరిగాయో, అసలు మీ జేబుకు ఎంత చిల్లు పడుతుందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
భారతీయ రైల్వే శాఖ ట్రైన్ టికెట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 26, అంటే ఈరోజు నుంచే ఈ కొత్త ధరలు అమలులోకి వస్తున్నాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే రైల్వే చార్జీలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

ఎవరిపై ప్రభావం పడుతుంది?
ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై ఈ భారం పడనుంది. అయితే సామాన్యులకు ఊరటనిచ్చే విషయం ఏంటంటే.. సబర్బన్ (లోకల్) రైళ్లు, సీజన్ టికెట్లు (MST) తీసుకునే వారికి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అలాగే 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి పాత ధరలే వర్తిస్తాయి.
కొత్త ధరలు ఇలా..
రైల్వే శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం..
- ఆర్డినరీ క్లాస్ (215 కిమీ పైన): కిలోమీటరుకు 1 పైసా పెంపు.
- మెయిల్/ఎక్స్‌ప్రెస్ (నాన్-ఏసీ): కిలోమీటరుకు 2 పైసల పెంపు.
- ఏసీ క్లాసులు (అన్ని రకాలు): కిలోమీటరుకు 2 పైసల పెంపు.
హైదరాబాద్ నుండి ఇతర నగరాలకు ధరల ప్రభావం
మన భాగ్యనగరం నుంచి ప్రయాణించే వారికి టికెట్ ధరలు ఎలా మారతాయో ఒకసారి చూద్దాం..
- హైదరాబాద్ - తిరుపతి: సుమారు 660 కిలోమీటర్ల దూరం ఉంటుంది. స్లీపర్ లేదా ఏసీ క్లాస్‌లో ప్రయాణిస్తే దాదాపు రూ.13 నుండి రూ.15 వరకు ధర పెరిగే అవకాశం ఉంది.
- హైదరాబాద్ - విజయవాడ: ఇది దాదాపు 310 కిలోమీటర్ల దూరం. ఇక్కడ కూడా నాన్-ఏసీ, ఏసీ క్లాసుల్లో టికెట్‌పై రూ.6 నుండి రూ.8 వరకు అదనంగా భారం పడుతుంది.
- హైదరాబాద్ - బెంగళూరు: సుమారు 620 కిలోమీటర్ల ప్రయాణానికి దాదాపు రూ.12 నుంచి రూ.15 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
- హైదరాబాద్ - ఢిల్లీ: దాదాపు 1600 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం కాబట్టి, ఇక్కడ టికెట్ ధర సుమారు రూ.32 నుండి రూ.35 వరకు పెరగవచ్చు.
పాత టికెట్ల పరిస్థితి ఏంటి?
మీరు ఇప్పటికే టికెట్ బుక్ చేసుకుని ఉంటే కంగారు పడక్కర్లేదు. డిసెంబర్ 26వ తేదీ కంటే ముందు బుక్ చేసుకున్న వారికి పాత ధరలే వర్తిస్తాయి. మీరు ప్రయాణం డిసెంబర్ 26 తర్వాత చేసినా కూడా అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం ఈరోజు నుంచి కొత్తగా బుక్ చేసే ట్రైన్ టికెట్స్ (Train tickets) కు మాత్రమే పెరిగిన ధరలు వర్తిస్తాయి.
ధరలు ఎందుకు పెంచారు?
రైల్వే నెట్‌వర్క్ విస్తరణ, సిబ్బంది జీతభత్యాలు, పెన్షన్ ఖర్చులు భారీగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. సుమారు రూ.600 కోట్ల అదనపు ఆదాయాన్ని ఈ పెంపు ద్వారా రైల్వే ఆశిస్తోంది.
మొత్తంగా ధరల పెంపు స్వల్పంగా ఉన్నప్పటికీ, సామాన్యుడి బడ్జెట్‌పై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది.. ముఖ్యంగా పండుగ సీజన్లలో ఊళ్లకు వెళ్లే వారికి ఇది కాస్త భారమే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications