Train Ticket: రైలు ప్రయాణంలో మనందరికీ ఈ సమస్య సాధారణంగా ఎదురవుతూనే ఉంటుంది. అదే సీటు కన్ఫర్మ్ కాకపోవటం. మరీ ముఖ్యంగా సుదూర ప్రయాణాలకు రైళ్లను ఎక్కువ మంది ఎంచుకుంటారు కాబట్టి ఇది చాలా పెద్ద సమస్యగా మారుతుంది.

సరికొత్త టెక్నాలజీ..
భారతీయ రైల్వే ప్రపంచంలో నాల్గవ అతిపెద్దది. ఆసియాలో రెండవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ గా ఉంది. ప్రతిరోజు లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తుంటారు. భారతీయ రైల్వేలు ప్రయాణీకుల సౌలభ్యం కోసం తమ సేవలను నిరంతరం మెరుగుపరచడం కొనసాగిస్తున్నాయి.
తాజాగా.. కోట్లాది మంది ప్రయాణికులకు రైల్వే ఓ పెద్ద వార్త అందించింది. ఇకపై ప్రయాణికులు నడుస్తున్న రైలులో కూడా ధృవీకరించబడిన సీట్లను పొందుతారు. కాబట్టి సీటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ తెలిపింది. అందుకోసం రైల్వే కొత్త టెక్నాలజీ వినియోగాన్ని ప్రారంభించింది.

RAC టికెట్ కోసం..
ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల, ప్రయాణీకులు RAC టికెట్ కోసం వేచి ఉండటానికి లేదా ధృవీకరణ కోసం TTE ద్వారా వెళ్లవలసిన అవసరం లేదు. ఈ సదుపాయం రైల్వే హ్యాండ్ హోల్డింగ్ డివైజ్ (HHT) సహాయంతో అందుబాటులో ఉంటుంది. ఈ యంత్రాల నుంచి సీట్ల ఖాళీల రియల్ టైం సమాచారం అందుబాటులో ఉంటుంది. దీంతో నేరుగా ప్రయాణికులకు మేలు జరుగనుంది. దీన్ని ఉపయోగించి ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను కన్ఫర్మ్ చేసుకుంటున్నారు.

గతంలో ఇలా ఉండేది..
ఒక ప్రయాణికుడు కొన్ని కారణాల వల్ల రైలులో ప్రయాణించకపోతే అతని సీటు ఖాళీగా ఉంటుంది. ఇలాంటి సీట్లను టీటీఈ వేచి ఉన్న వ్యక్తికి గతంలో ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఖాళీ సీట్ల గురించిన సమాచారం HHT పరికరంలో అందుబాటులో ఉంటుంది. రైలులో ఏదైనా సీటు ఖాళీగా ఉంటే అది వేచి ఉన్న ప్రయాణికులకు(Waiting List) లేదా RAC ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది. ఇది ప్రయాణీకులకు చాలా సౌకర్యాన్ని అందిస్తుంది. దీంతో వారు నడుస్తున్న రైలులో ఎక్కిన తర్వాత కన్ఫర్మ్ టికెట్ పొందుతారు.

100% సరైన సమాచారం..
గత నెలలో రైల్వే శాఖ ప్రవేశపెట్టిన కొత్త టెక్నాలజీ ఇది. HHT యంత్రం ఐప్యాడ్ లాంటిది. ఇందులో ప్రయాణీకుల చార్ట్ ఉంటుంది. ఈ చార్ట్ నిరంతరం రియల్ టైంలో అప్‌డేట్ అవుతూనే ఉంటుంది. అందువల్ల Cancelled టిక్కెట్ల సీట్లు, RAC సీట్ల తాజా వివరాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. పైగా ఈ సదుపాయం రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌తో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి దానిపై అప్‌డేట్ చేయబడిన సమాచారం 100 శాతం సరైనది. ఈ విధానాన్ని వినియోగించుకోవటం ద్వారా ప్రయాణికులు సాఫీగా రైల్వే సేవలను ఆస్వాధించవచ్చు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications