Tata Nexon: ట్రైన్‌కే సవాలు విసిరిన టాటా నెక్సాన్.. హెవీ డ్యూటీ కార్లకు సాధ్యంకాని ఫీట్ సొంతం

Tata Nexon: వ్యాపారాల్లో లాభాల కంటే తమ ఉత్పత్తుల్లో నాణ్యతకు టాటా గ్రూపు ప్రయారిటీ ఇస్తుందని మరోసారి రుజువైంది. టాటా నెక్సాన్ SUVకి సంబంధించి తాజాగా జరిగిన ఓ సంఘటన.. ఆ గ్రూపు కంపెనీలపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసింది.

టాటా గ్రూపు ఉత్పత్తి చేసిన నెక్సాన్ కారును ఇటీవల రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనానికి పెద్దగా డ్యామేజీ కాలేదు. కనీసం విండ్ షీల్డ్ కూడా చెక్కుచెదరలేదు. ఇక్కడే తన బిల్డ్ క్వాలిటీని టాటా గ్రూపు నిరూపించుకుంది. దేశంలోని అత్యంత సురక్షితమైన వాహనాల్లో ఒకటిగా నెక్సాన్ దాని స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది.

Train accident reveals Tata Nexon has ultimate build quality

భారత్ లో తయారు చేయబడి గ్లోబల్ NCAPలో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన కార్లలో టాటా నెక్సాన్ ఒకటి. గత సంవత్సరాల డేటాను పరిశీలిస్తే టాటా నెక్సాన్ అనేక ప్రమాదాలకు గురైంది. కానీ దాని ధృడమైన నిర్మాణ నాణ్యత అసాధారణమని నిరూపించబడింది. అనేక హెవీ డ్యూటీ వాహనాలతో పోలిస్తే నాణ్యత విషయంలో నెక్సాన్ చాలా బెటర్‌ గా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ కాంపాక్ట్ SUV ధర 8.10 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ఇటీవలే కొత్తగా పునరుద్ధరించబడిన బాహ్య డిజైన్ తో పాటు మరింత ప్రీమియం క్యాబిన్‌తో మేకర్స్ వాహనానికి మార్పులు చేశారు. మహీంద్రా XUV300, హ్యుందాయ్ వెన్యూ, మారుతి సుజుకి బ్రెజ్జా మరియు కియా సోనెట్ వంటి వాటితో నెక్సాన్ ప్రస్తుతం పోటీపడుతోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+