Telecom News: టెల్కోల దూకుడుకు ట్రాయ్ బ్రేక్.. కొత్త రూల్స్‌తో ఎయిర్‌టెల్, జియోలకు ఇక గడ్డుకాలమే..
TRAI new rules: మొబైల్ రీఛార్జ్ ధరలు విపరీతంగా పెంచేసి సామాన్యుల నడ్డి విరుస్తున్న టెల్కోలకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. సర్వీసు విషయంలో ఇకపై ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే వీల్లేదని తెగేసి చెప్పింది. ప్రమాణాలను పాటించడంల విఫలమైతే కళ్లు చెదిరే స్థాయిలో జరిమానా విధించేందుకు సిద్ధమైంది.
యూజర్లకు మెరుగైన బ్రాడ్ బ్యాండ్ యాక్సెస్ మరియు నాణ్యమైన సేవలను అందించాలని టెల్కోలకు ట్రాయ్ హుకుం జారీ చేసింది. ఈ రంగంలో ప్లేయర్స్ పనితీరు మరియు పారదర్శకతను పెంచడమే తమ లక్ష్యమని తెలిపింది. టెలికాం కంపెనీల సేవల్లో లోపాలు తలెత్తితే సహించేది లేదని, కొరడా ఝళిపించడం ఖాయమని హెచ్చరించింది.

జిల్లా స్థాయిలో ఒక రోజు కంటే ఎక్కువసేపు సేవలకు అంతరాయం ఏర్పడితే, టెలికాం కంపెనీలు తమ కస్టమర్‌లకు పరిహారం అందించడాన్ని ట్రాయ్ తప్పనిసరి చేసింది. పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు తమ నెలవారీ బిల్లులలో ఈ తగ్గింపును చూడవచ్చు. అదే ప్రీపెయిడ్ కస్టమర్స్ అయితే వారి కనెక్షన్ వ్యాలిడిటీ పొడిగింపు పొందుతారు.
అదే 24 గంటలు దాటే తీవ్రమైన నెట్‌వర్క్ డౌన్‌టైమ్ సందర్భాల్లో సదరు ఆపరేటర్‌లు కస్టమర్‌లకు పాక్షికంగా రీఫండ్ చేయాలంటూ టెలికాం రెగ్యులేటర్ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. నిర్ణీత ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే పక్షంలో విధించే జరిమానాను 50 వేల నుంచి 1 లక్షకు పెంచింది. దీనితో పాటు సిమ్ స్వాప్ మరియు రీప్లేస్‌మెంట్ విషయంలో మోసపూరిత కార్యకలాపాలను కట్టడి చేయడానికి పోర్టబిలిటీ కింద కొత్త సిమ్ రీప్లేస్‌మెంట్ నియమాలకు స్వల్ప సవరణలు చేసింది.


Click it and Unblock the Notifications