టెలికం కంపెనీలు ఆఫర్ చేస్తోన్న మొబైల్ ఛార్జీల కాలపరిమితిపై కస్టమర్లు వ్యక్తం చేస్తోన్న ఆందోళనలు, ఫిర్యాదుల నేపథ్యంలో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) గురువారం ఓ చర్చా పత్రాన్ని జారీ చేసింది. టెలికం టారిఫ్ ఆఫర్స్ వ్యాలిడిటీ కాలపరిమితిపై ప్రశ్నించింది. టెల్కోస్ అందిస్తోన్న 28 రోజుల కాలపరిమితిపై ట్రాయ్‌కు ఎన్నో ఫిర్యాదులు వచ్చాయి. ఇందుకు సంబంధించి కస్టమర్ల నుండి చాలా రిఫరెన్సెస్ వచ్చాయని, నెలకు బదులు 28 రోజులు ఎందుకో చెప్పాలని రెగ్యులేటర్ అడిగింది.

ట్రాయ్ ప్రకటన
నెలరోజుల పరిమితి బదులు 28 రోజుల పరిమితిపై టెలికం కంపెనీలు ప్రస్తుతం రీచార్జ్ టారీఫ్ ఆఫర్లను అందిస్తున్నాయి. వివిధ మార్గాల ద్వారా అందిన ఫిర్యాదుల ప్రకారం టెలికం సర్వీస్ ప్రొవైడర్ల(TSPs) కొన్ని రీచార్జ్ టారిఫ్స్/ఓచర్లు చాలామంది కస్టమర్లకు సంతృప్తికరంగా లేవని ట్రాయ్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

నెలకు 28 రోజుల వోచర్ల కారణంగా...
నెలకు బదులు 28 రోజుల వోచర్ల కారణంగా ఏడాదికి 12కు బదులు 13 రీచార్జీల అవసరం ఏర్పడుతుందని, తాము మోసపోతున్నామని ప్రీపెయిడ్ కస్టమర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ట్రాయ్ తెలిపింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు నెలల వారీగా TSPs ఆఫర్లు ఇస్తుండగా, ప్రీపెయిడ్ కస్టమర్లకు బహుళ ప్రాచుర్యం పొందిన వోచర్లను రోజులు, వారాల ప్రాతిపదికన 28 లేదా 56 లేదా 84 రోజుల కాలపరిమితితో నిర్ణయిస్తున్నాయని ట్రాయ్ తెలిపింది. ఈ కాలపరిమితి వివాదంపై జోక్యం చేసుకోవాలా? లేక అనుమతించాలా? టెలికం కంపెనీలు అందించే రీచార్జీ ఆఫర్ల టారిఫ్స్, వాటి కాలపరిమితులు, కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించడం అనే అంశాలపై ప్రజలు, పరిశ్రమ నుండి సూచనలు కోరుతూ ట్రాయ్ ఈ చర్చాపత్రాన్ని జారీ చేసింది.

కామెంట్స్.. కౌంటర్ కామెంట్స్
దీనిపై కామెంట్స్‌కు జూన్ 11, కౌంటర్ కామెంట్స్‌కు జూన్ 25 గడువులోగా ట్రాయ్ నిర్ణయించింది. ఆఫర్స్ కాలపరిమితిపై TSPsలకు ఆదేశాలివ్వాలా, సూచనలివ్వాలా? ఒక ఆఫర్‌ను నెల పరిమితిగానా లేక 30 రోజుల పరిమితిగా జారీ చేయాలా? ప్రస్తుత 28 రోజుల ఆఫర్లతో పాటు ప్రతి నెలా ఒకే తేదీన రీఛార్జ్ చేసుకునే కాలపరిమితి కలిగిన వోచర్లను అందించాలా? నెలవారీ ఆఫర్ల తరహాలో 3 నెలలు, 6 నెలలు, ఏడాది కాలాలకు ప్రీపెయిడ్ టారిఫ్ ఓచర్లు ఇవ్వాలా? ఇలా వివిధ అంశాలపై కామెంట్స్‌ను ట్రాయ్ ఆ చర్చాపత్రంలో కోరింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications