A Oneindia Venture

బ్యాంకులకు ట్రాయ్ కీలక అప్‌డేట్.. 1600 సీరిస్ నంబర్‌తోనే కస్టమర్లకు కాల్స్ వెళ్లాలి.. జనవరి 1 నుంచి అమల్లోకి..

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) బ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా రంగ సంస్థలు ఉపయోగిస్తున్న ప్రస్తుత 10 అంకెల మొబైల్ ల్యాండ్‌లైన్ నంబర్ల స్థానంలో జనవరి 1, 2026 నుండి దశలవారీగా కొత్త 1600 నంబరింగ్ సిరీస్ ను తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ముఖ్యంగా స్పామ్ కాల్స్, ఆర్థిక మోసాలు, డిజిటల్ అరెస్టుల వంటి పెరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకున్నదిగా ట్రాయ్ స్పష్టం చేసింది.

ప్రస్తుతం మోసగాళ్లు ప్రభుత్వ శాఖలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు లేదా బ్యాంకుల ప్రతినిధులుగా నటిస్తూ వాయిస్, వీడియో కాల్స్ ద్వారా అమాయకుల నుండి భారీగా డబ్బు దోచుకుంటున్న నేపథ్యంలో, RBI, SEBI, PFRDA నియంత్రణలో ఉన్న సంస్థలకు 1600 సిరీస్ వినియోగం తప్పనిసరి చేసి కాలర్‌ను సులభంగా గుర్తించే అవకాశం కల్పించడమే ఈ నిర్ణయ లక్ష్యం.

TRAI 1600 series financial entities calling series TRAI directive 2026 bank calling number 1600 NBFC calling series fraud prevention calls India TRAI new numbering plan financial communication security 1600 number rollout India telecom regulation verified financial calls customer safety calling series 1600 2026 1600 NBFC 1600

ట్రాయ్ తెలిపినదాని ప్రకారం, ఇప్పటి వరకు ప్రామాణిక 10 అంకెల నంబర్లను ఉపయోగిస్తున్న సంస్థలు వెంటనే 1600 సిరీస్కు మారితే మాత్రమే తప్పుదారి పట్టించే కాల్స్ ప్రమాదం తగ్గుతుంది. JCoR (జాయింట్ కమిటీ ఆఫ్ రెగ్యులేటర్స్) సమావేశాల్లో చర్చించిన తర్వాత BFSI రంగం నియంత్రణ సంస్థల సూచనలు తీసుకొని ఈ కాలక్రమాన్ని ఖరారు చేసింది.

టెలికాం నిపుణులు ఈ చర్యను వినియోగదారుల భద్రత పట్ల ఒక పెద్ద అడుగుగా అభివర్ణించారు. EY ఇండియా లీడర్ ప్రశాంత్ సింఘాల్ తెలిపిన వివరాల ప్రకారం.. భారతదేశంలో సగటున ఒక్క వినియోగదారుడు రోజుకు మూడు స్పామ్ కాల్స్ అందుకుంటున్నాడు; 2024లో మాత్రమే స్పామ్ పై 147 మిలియన్ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంతో కాల్ మూలాన్ని సులభంగా గుర్తించే 1600 సిరీస్ నిర్ణయాత్మక మార్పును తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. PwC ఇండియా టెలికాం లీడర్ వినీష్ బావా కూడా ఈ కొత్త సిరీస్ ఆర్థిక మోసాలను అడ్డుకునే విశ్వసనీయ ముద్రగా మారుతుందని పేర్కొన్నారు.

సంస్థలవారీగా గడువులు ఇలా ఉన్నాయి: RBI నియంత్రిత సంస్థలు
వాణిజ్య బ్యాంకులు: 2026 జనవరి 1 నుంచి
పెద్ద NBFCలు, పేమెంట్ బ్యాంకులు, SFBలు: ఫిబ్రవరి 1 వరకు
ఇతర NBFCలు, కోఆపరేటివ్ బ్యాంకులు, RRBలు: మార్చి 1 వరకు

SEBI నియంత్రిత సంస్థలు
మ్యూచువల్ ఫండ్స్ & AMCలు:ఫిబ్రవరి 15
స్టాక్ బ్రోకర్లు: మార్చి 15
ఇతర మధ్యవర్తులు ధృవీకరణ తర్వాత స్వచ్ఛందంగా వలస వెళ్లవచ్చు

PFRDA కింద..
CRAలు & పెన్షన్ ఫండ్ మేనేజర్లు: ఫిబ్రవరి 15
IRDAI (బీమా రంగం)

టెలికమ్యూనికేషన్స్ విభాగం BFSI, ప్రభుత్వ సంస్థల సేవ-లావాదేవీ కాల్స్‌ను వాణిజ్య కాల్స్ నుండి వేరు చేయడానికి 1600 సిరీస్‌ను ప్రత్యేకంగా కేటాయించింది. ఇప్పటికే 485 సంస్థలు 1600 సిరీస్‌ను స్వీకరించగా, 2,800 కంటే ఎక్కువ నంబర్లకు సభ్యత్వం పొందాయి.ఇకపై 1600 నంబర్ సిరీస్ అమలు వినియోగదారుల భద్రతను గణనీయంగా పెంచడం తో పాటు ఆర్థిక మోసాలను అరికట్టడంలో కీలక పాత్ర పోషించనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+