మొబైల్ రీఛార్జి టారిఫ్ లు సామాన్యుడికి మోయలేని భారంగా తయారవుతున్నాయి. ఇన్ కమింగ్ సేవలను పొందాలన్నా సుమారు రూ.100 వదిలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో పూర్తి ఉచితంగా పొందిన ఈ సేవలకు, ఇప్పుడు మాత్రం పెద్ద మొత్తంలో వెచ్చించాల్సి రావడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI).. ఉపశమన చర్యలు ప్రారంభించిందని ఓ ప్రముఖ వార్తా సంస్థ నివేదించింది.

భరించలేని స్థాయికి ధరలు
పేద, మధ్యతరగతి వర్గాలు భరించలేని స్థాయికి మొబైల్ రీఛార్జి ధరలు పెరుగుతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సామాన్యులపై భారాన్ని తగ్గించే ఉద్దేశంతో.. ప్రత్యేకంగా ఇన్ కమింగ్ మరియు SMS సేవల వినియోగానికి తక్కువ ధరలో ప్యాక్ లు అందించేందుకు TRAI ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కనెక్టివిటీ అనేది ప్రతి ఒక్కరి జీవితాల్లో అతి ముఖ్యమైన భాగం కాగా.. ధరల పెరుగుదల వల్ల ఉన్నత వర్గాలు మినహా ఇతరులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉండటం లేదని ఆ సంస్థ భావిస్తోంది.

దశలవారీగా టారిఫ్ పెంపు
ప్రస్తుతం మార్కెట్ పరిస్థితిని గమనిస్తే, ARPUని పెంచుకునే పనిలో టెల్కోలు ఉన్నాయి. ఎయిర్ టెల్ ప్రాథమిక బేస్ ప్లాన్ గతంలో రూ.99 నుంచి మొదలయ్యేది కానీ ఇప్పుడు రూ.155కి పెంచినట్లు నివేదిక పేర్కొంది. కొన్ని సర్కిళ్లలో ఈ ధరలు అమలుచేయగా.. త్వరలోనే మిగిలిన వాటిలోనూ టారిఫ్ లు పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది.
ఒక్కసారిగా పెద్దఎత్తున రేట్లు పెంచితే వినియోగదారులు దూరమవుతారని, దశలవారీగా అమలుచేస్తే కస్టమర్లు కుదురుకుంటారనే ప్లాన్ లో టెల్కోలు ఉన్నట్లు అభిప్రాయపడింది.

ఇన్ కమింగ్ అయినా భారమే..
అయితే ట్రాయ్ చేసిన ఈ ప్రతిపాదన పట్ల టెలికం కంపెనీలు(టెల్కోలు) విముఖత చూపిస్తున్నట్లు వార్తా సంస్థ పేర్కొంది. ఒక్కో వినియోగదారుడి నుంచి సమకూరుతున్న సరాసరి ఆదాయం(ARPU) పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న తమ లక్ష్యాలు నెరవేరవని వాదిస్తున్నట్లు తెలిపింది. ఇన్ కమింగ్ లేదా అవుట్ గోయింగ్ ఏదైనా సరే నెట్వర్క్ వినియోగం తప్పనిసరి కాబట్టి.. తక్కువ ధర ప్లాన్ లు తీసుకొస్తే తమ వనరుల వినియోగం భారీగా పెరుగుతుందని ఓ కంపెనీ ప్రతినిధి చెప్పినట్లు వెల్లడించింది.

అధికారిక ప్రతిపాదన లేదు కానీ..
దీనిపై నియంత్రణ మండలి అధికారికంగా ప్రతిపాదించలేదు కానీ ఆఫ్‌లైన్ సంప్రదింపులు ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ట్రాయ్ నిర్ణయం అమల్లోకి వస్తే, సామాన్యులపై రీఛార్జి భారం తగ్గుతుందనడంలో సందేహం లేదు. భవిష్యత్తులో ఏమౌతుందో చూడాలి మరి !!
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications