IPO News: గ్రేమార్కెట్లో 115% ప్రీమియంతో ఐపీవో.. సెప్టెంబర్ 10న స్టార్ట్ అవుతున్న క్రేజీ ఐపీవో..
Trafiksol ITS Technologies IPO: భారతీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోలకు నిరంతరాయంగా క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఒకదాన తర్వాత మరొకటి క్యూకడుతున్నప్పటికీ ఇన్వెస్టర్లలో జోష్ ఏమాత్రం తగ్గటం లేదు. లాభాల రుచిచూస్తున్న ట్రేడర్లు వరుసగా బెట్టింగ్ వేస్తూనే ఉన్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది Trafiksol ITS Technologies కంపెనీ ఐపీవో గురించే. రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం కంపెనీ ఐపీవో సెప్టెంబర్ 10 నుంచి 13 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.70గా నిర్ణయించింది. ట్రాఫిక్‌సోల్ ఐటీఎస్ టెక్నాలజీస్ ఐపీవో రూ.44.87 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఐపీవో పూర్తిగా తాజా ఇష్యూగా కంపెనీ వెల్లడించింది. కంపెనీ ప్రమోటర్లుగా జితేంద్ర నారాయణ్ దాస్, పూనమ్ దాస్ ఉన్నారు.

ఐపీవో ప్రారంభానికి ముందే ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ షేర్లపై భారీ స్పందన కనిపిస్తోంది. దీంతో ఐపీవోకు గ్రే మార్కెట్‌లో బలమైన స్పందన నమోదైంది. ప్రస్తుతం గ్రేమార్కెట్లో ఒక్కో షేరుపై రూ.80 ప్రీమియం ధర పలుకుతోంది. ఇదే ధర లిస్టింగ్ రోజు వరకు కొనసాగితే ఒక్కో షేరు మార్కెట్లో రూ.150 ధరకు బలమైన జాబితాను నమోదు చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే కంపెనీ షేర్లపై బెట్టింగ్ వేసి షేర్లు పొందే దరఖాస్తుదారులు 115 శాతం రాబడిని అందుకుంటారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ షేర్ల లిస్టింగ్ సెప్టెంబర్ 17న ఉంటుందని తెలుస్తోంది.
కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే ట్రాఫిక్ భద్రతకి వినూత్న సాంకేతికతలు, పరిష్కారాలను కంపెనీ అందించటంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో అత్యంత సంక్లిష్టమైన ట్రాఫిక్ సవాళ్లను పరిష్కరించే ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా దేశంలో కొనసాగుతోంది. తీవ్రమైన గాయాలు, ప్రమాదాలను నివారించడానికి వినియోగదారులకు సమయానుకూలంగా హెచ్చరికలను అందించడం ద్వారా రియల్ టైమ్ ప్రమాదాలను తగ్గించడానికి కట్టుబడి ఉంది. అలాగే మెరుగైన డిజైన్ అప్లికేషన్‌లు, ప్రమాణాలు, మార్గదర్శకాలను ఉపయోగించడం ద్వారా ప్రమాద ప్రమాదాలను తగ్గించడానికి పని చేస్తుంది. 2024లో కంపెనీ రూ.66.09 కోట్ల ఆదాయంతో పాటు రూ.12.09 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది.


Click it and Unblock the Notifications