తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం ఇప్పుడు భారతదేశంలోనే అత్యధిక వాహనాలు కలిగిన నగరంగా మారింది. రహదారులపై వాహనాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో, ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకూ నగరంలో తీవ్రమవుతున్నాయి. ప్రస్తుతం నగరంలోని 900 కి.మీ ప్రధాన రహదారులపై 86 లక్షలకు పైగా వాహనాలు నడుస్తున్నాయి. ఇది ప్రతి కి.మీ రహదారిపై సగటున 9,500 వాహనాలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
గత ఆరు సంవత్సరాల్లో వాహనాల సంఖ్య దాదాపు 40 శాతం పెరిగింది. 2019లో ఒక కిలోమీటరుకు సుమారు 6,500 వాహనాలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 9,500కి చేరింది. ఇది రహదారి మౌలిక సదుపాయాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తోంది. మొత్తం వాహనాలను చూసుకున్నట్లయితే 63 లక్షలు ద్విచక్ర వాహనాలు ఉండగా.. 16 లక్షలు కార్లు ఉన్నాయి. ఈ రెండు కలిపి నగర ట్రాఫిక్‌లో 90 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నాయి. ప్రతిరోజూ 1,500-2,000 కొత్త వాహనాలు నమోదు అవుతున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగితే .. 2027-28 నాటికి హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య 1 కోటి దాటే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

ప్రైవేట్ వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ జామ్‌లు రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ప్రయాణ సమయం పెరగడంతో పాటు ఇంధన వినియోగం ఎక్కువవుతోంది. దీనివల్ల వాయు కాలుష్యం కూడా పెరిగి, పర్యావరణానికి హానికరంగా మారుతోంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర రోడ్ల పొడవు 26,000 కి.మీగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.7 కోట్ల వాహనాలు ఈ రోడ్లపై నడుస్తున్నా.. ప్రతి కి.మీకి కేవలం 653 వాహనాల సాంద్రత మాత్రమే ఉంది. దీని ద్వారా హైదరాబాద్ నగరంపై వాహనాల ఒత్తిడి అసాధారణంగా ఎక్కువగా ఉందని స్పష్టమవుతోంది.
ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఈ వాహన భారాన్ని తట్టుకోలేకపోతోంది. ఒకప్పుడు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారంగా భావించిన మెట్రో రైలు ఇప్పుడు రద్దీ సమయాల్లో కిక్కిరిసిపోతుంది. ఉదయం 8.30 నుండి 10.30 మధ్య నడిచే రైళ్లు ఎప్పుడూ పూర్తి సామర్థ్యాన్ని మించిపోతున్నాయి. ఇది సరైన ప్రణాళిక లేకపోవడం, నిర్వహణ లోపంను సూచిస్తోందని పలువురు చెబుతున్నారు.
రవాణా నిపుణులు దీనికి పలు పరిష్కారాలను సూచిస్తున్నారు.. అవేంటంటే.. కార్‌పూలింగ్, రైడ్-షేరింగ్ ప్రోత్సహించాలంటున్నారు. Hyderabad నగరంలో మెట్రో, బస్సు సేవలను మరింత బలోపేతం చేయాలని సలహా ఇస్తున్నారు. రెండవ వాహనం కొనుగోలుపై ప్రభుత్వం ఆంక్షలు విధించాలని సూచిస్తున్నారు. వాణిజ్య భవనాలకు తగినంత పార్కింగ్ సదుపాయాలు తప్పనిసరి చేయాలని చెబుతున్నారు.
ఏదేమైనా హైదరాబాద్ వాహనాల సంఖ్యలో వేగంగా పెరుగుతుండటంతో, రోడ్లపై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. తక్షణ చర్యలు తీసుకోకపోతే, ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమై, కాలుష్యం కూడా అదుపు తప్పే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రజల సహకారంతో మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం సాధ్యమవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications