ట్రాఫిక్ జామ్‌లతో అలసిపోయారా? ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడు గ్రీన్ అవుతుందో ముందే చెబుతున్న Mappls యాప్!
బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కొత్తది కాదు... దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ట్రాఫిక్‌తోనే రోజువారీ పోరాటం చేస్తున్నారు. ఆఫీస్‌కి చేరుకోవాలంటే కేవలం 25 కిలోమీటర్ల ప్రయాణం కోసం కూడా చాలా మంది 1 గంట 45 నిమిషాల ముందే ఇంటి నుంచి బయలుదేరుతారు. రోడ్లపై ఎప్పుడు సిగ్నల్ వస్తుందో, ట్రాఫిక్ లైన్ ఎంత పొడవుగా ఉంటుందో ఎవరికి తెలియదు. ప్రతి రోజు ఆఫీస్ టైమ్‌కి చేరుకోవడం ఒక సర్కస్‌లా మారిపోయింది.
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎంతసేపు రెడ్‌లో ఆగాలి? గ్రీన్ అవ్వడానికి ఇంకా ఎంత సెకన్లు? ఇక మీదట ఇవన్నీ Mappls యాప్‌లోనే లైవ్‌గా కనిపించబోతున్నాయి. అవును... బెంగళూరు ఈ ఫీచర్‌ను ప్రారంభించిన "భారతదేశంలో మొదటి నగరంగా" నిలిచింది. ఈ కొత్త ఫీచర్ వల్ల వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్‌లను నిజ సమయంలోనే తెలుసుకోగలరు. డ్రైవింగ్‌లో డిసిషన్ తీసుకోవడం సులభం అవుతుంది, ట్రాఫిక్ ఫ్లో కూడా మెరుగవుతుంది.

ఈ ఇన్నోవేషన్ వెనుక బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీస్, ఆర్కాడిస్ ఇండియా, Mappls (MapmyIndia ఆధారిత) టెక్ టీమ్ కలిసి పనిచేశాయి. సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు Mappls యాప్‌లో అదే సిగ్నల్ కౌంట్‌డౌన్ రన్ అవుతుంది. సిగ్నల్ మారడానికి ఎన్ని సెకన్లు మిగిలాయో స్క్రీన్ పైనే కనిపిస్తుంది.
Mappls యాప్ ట్రాఫిక్ సిగ్నల్ టైమింగ్‌లను తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది IoT (Internet of Things) సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది. అంటే, ట్రాఫిక్ సిగ్నల్‌లకు స్మార్ట్ డివైసులు కనెక్ట్ అయి ఉంటాయి. అవి ప్రతి సిగ్నల్‌లో గ్రీన్, రెడ్ లైట్ ఎంత సేపు ఉంటుందో, తదుపరి మార్పు ఎప్పుడు జరుగుతుందో వంటి వివరాలను రియల్ టైమ్‌లో సేకరిస్తాయి. ఆ సమాచారం వెంటనే Mappls యాప్‌కు పంపబడుతుంది. దీంతో యూజర్లు ముందుగానే సిగ్నల్ టైమింగ్‌లను చూడగలరు, దానికి అనుగుణంగా తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ సిస్టమ్ ద్వారా ట్రాఫిక్ జామ్‌లు తగ్గడం, ప్రమాదాలు తగ్గించడం, ఇంధన వృథా తగ్గించడం వంటి ప్రయోజనాలు కూడా అందించగలదు.
MapmyIndia డైరెక్టర్ రోహన్ వర్మ X లో ఈ ఫీచర్ గురించి చెబుతూ, "ఇది మ్యాజికల్... మరియు చాలా హెల్ప్‌ఫుల్ కూడా!" అని అన్నారు. ఆయన పోస్ట్‌కు 2.65 లక్షల వ్యూస్ వచ్చాయి చాలా మంది నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
ఇక ఒక యూజర్ ఇలా అడిగాడు "ఇది నిజంగా ఎంత ఉపయోగపడుతుంది?" దీనికి వర్మ సమాధానం "ఉదాహరణకు మీరు సిగ్నల్‌కు 500 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు, రెడ్/గ్రీన్ అవ్వడానికి ఎంత సమయం ఉందో ముందుగానే తెలుసుకుంటే, చాలా సిట్యుయేషన్లలో ఇది ప్రాక్టికల్‌గా హెల్ప్ చేస్తుంది. ఇది ట్రాఫిక్‌ను స్మూత్‌గా నడిపించడంలో కూడా కీలకం అవుతుంది" అని చెప్పారు. ఇంకో యూజర్ అయితే "వావ్! ఈ ఫీచర్ గూగుల్‌లో కూడా లేదు అనుకుంటున్నాను" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
ట్రాఫిక్ జామ్‌లకు పేరుగాంచిన బెంగళూరు ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీతో మళ్లీ ఒకసారి ముందంజ వేసింది. ఈ ఫీచర్ సక్సెస్ అయితే, త్వరలోనే ఇతర మెట్రో నగరాల్లో కూడా ఇది అందుబాటులోకి రానుంది.


Click it and Unblock the Notifications