Layoffs News: రోజులు గడుస్తున్నా కానీ కరోనా వల్ల ఏర్పడిన విఘాతం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోగా ఈ సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఒకదాని తర్వాత ఇంకో కంపెనీ వరుస లేఆఫ్స్‌తో ఉద్యోగార్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ప్రముఖ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ఎక్స్‌పీడియా భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్రకటించింది. సాంకేతిక పరివర్తనలో భాగంగా దాదాపు 1,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలిపింది. మొత్తం 17,100 మంది గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 9 శాతం మందిపై ఈ కోతలు ప్రభావం చూపించనున్నాయి. పోస్ట్-పాండమిక్ బూమ్ తర్వాత ప్రయాణ డిమాండ్ మందగించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

'ఎక్స్‌పీడియా గ్రూప్ పరివర్తనలో అనేక ముఖ్యమైన సాంకేతిక మైలురాళ్లను ఇటీవల పూర్తి చేసింది. అత్యంత ముఖ్యమైన పనికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. వనరుల సముచిత కేటాయింపును మూల్యాంకనం చేస్తూనే ఉంది' అని కంపెనీ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఏ విభాగం నుంచి తొలగింపులు ఉంటాయి అనే నిర్ధిష్ట వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
వీర్‌బో, ఆర్బిట్జ్, హాట్‌వైర్.కాం మరియు ట్రావెలోసిటీ వంటి అనేక ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఎక్స్‌పీడియా హోటల్స్.కాం గతంలో కొనుగోలు చేసింది. కాగా కంపెనీ వృద్ధి కోసం ప్రధాన వ్యూహాత్మక రంగాలలో పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లు సంస్థ ప్రతినిధి వెల్లడించారు. ఈ ప్రయాణం కొన్ని పాత్రల తొలగింపుకు దారితీస్తాయని పేర్కొన్నారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications