Trading hours: భారతీయ స్టాక్ మార్కెట్లు దేశవిదేశాల్లోని ఇన్వెస్టర్స్‌కు స్వర్గధామంగా మారాయి. ఇతర దేశాల నుంచి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు పలువురు దిగ్గజ ప్లేయర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మార్కెట్ల పనివేళలు ఇందుకు అడ్డంకిగా మారాయి. వీటిని పొడిగించాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. దీనిపై తాజాగా ఓ బిగ్ అప్‌డేట్ వచ్చింది.
ఇందులో భాగంగా మొదటి దశలో సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య ఇండెక్స్‌లో డెరివేటివ్ ట్రేడింగ్‌ను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE) ప్రతిపాదించింది. ఈ విషయంపై వాటాదారుల అందరి అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకోవాలని NSEని సెబీ కోరినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

ఫిబ్రవరి 2న ఈ విషయంపై అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజ్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ANMI) బోర్డు బ్రోకరేజీ సంస్థ ప్రతినిధులతో సమావేశమైంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O)లో ట్రేడింగ్ గంటలను పొడిగించాలనే ప్రతిపాదనను సభ్యులు ఆమోదించారు. ఇందుకు అనుగుణంగా త్వరలోనే ప్రతిపాదన అంగీకార పత్రాన్ని సెబీకి పంపనుంది.
ఈ వ్యవహారంలో ఎటువంటి కార్యాచరణ సమస్యలు ఉండకూడదని మరియు ఎక్స్ఛేంజ్ నుంచి పూర్తి మద్దతు పొందే పరిస్థితి ఉందని బోర్డు పేర్కొంది. ఇది కార్యరూపం దాలిస్తే మార్కెట్ క్యాప్ మరింత బలపడుతుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications