ముంబై: భారత మార్కెట్లు నష్టాల నుండి కోలుకోవడం లేదు. గురువారం 1700 నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఆ తర్వాత దాదాపు 3,000 నష్టాలతో ముగిసింది. శుక్రవారం అంతకుమించిన నష్టాలతో ప్రారంభమైంది. ఏకంగా ప్రారంభంలోనే 3,000 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 966 పాయింట్ల నష్టానికి రావడంతో లోయర్ సర్క్యూట్‌ను టచ్ అయింది. దీంతో 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. ఈ వారంలో భారీగా నష్టాలు రావడం ఇది మూడోసారి. సోమవారం, గురువారం.. ఇప్పుడు శుక్రవారం మార్కెట్లు కుప్పకూలాయి.

1987 తర్వాత అమెరికాకు బ్లాక్ మండే...
మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.92 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. 1987 బ్లాక్ మండే తర్వాత భారీ నష్టాలను చవి చూసిన అమెరికా మార్కెట్ల ప్రభావం ఆసియా మార్కెట్లపై భారీ ప్రభావం చూపించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను మహమ్మారిగా ప్రకటించింది. దీంతో మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. కెనడా ప్రధాని ట్రూడో భార్యకు కూడా కరోనా సోకింది. భారత్‌లోను కరోనా కేసులు పెరుగుతున్నాయి.

కరోనా దెబ్బకు...
కరోనా కారణంగా ప్రయాణాలు నిలిచిపోయాయి. పరిశ్రమలు మూతబడ్డాయి. ఉద్యోగులు ఇంటికే పరిమితమవుతున్నారు. దిగ్గజ టెక్ కంపెనీలు మొదలు చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నాయి. బాండ్ మార్కెట్లో అనిశ్చితి ఉంది. వీటికి తోడు సౌదీ అరేబియా - రష్యా చమురు ధరల యుద్ధం ప్రపంచ మార్కెట్లపై తీవ్రంగా పడింది.

9,000కు దిగువన నిఫ్టీ
మార్కెట్ల పతనంతో ఇన్వెస్టర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సూచీలు ఇప్పటికే బేర్ జోన్లోకి ప్రవేశించాయి. మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతున్న దిద్దుబాటుకు ఇప్పట్లో తెరపడే అవకాశాలు కన్పించడం లేదని నిపుణులు భావిస్తున్నారు. ప్రతికూల ట్రేడింగ్ ట్రెండ్‌లో సూచీలు మరింతపడవచ్చునని చెబుతున్నారు. ఇప్పటికే 10,000 దిగువకు జారుకున్న నిఫ్టీ త్వరలో 8,800-8,100 స్థాయికి క్షీణించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.సూచీలు మరో 5-15% మేర క్షీణించవచ్చు. శుక్రవారం ట్రేడింగ్ నిలిపివేసే సమయానికి 9,000కు పైన ఉంది.

బంగారం, క్రూడ్ క్రాష్
కరోనా భయంతో పెట్టుబడి సాధనాల నుండి కూడా ఇన్వెస్టర్లు డబ్బును వెనక్కి తీసుకుంటున్నారు. డబ్బుగా భద్రపరచుకోడానికి మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోంది. చమురు, పసిడి నుండి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications