నేడు మార్కెట్లు క్లోజ్, సాయంత్రం తెరుచుకోనున్న కమోడిటీ మార్కెట్
మొహర్రం సందర్భంగా స్టాక్ మార్కెట్లకు నేడు సెలవు దినం. బీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ ప్రకారం స్టాక్ మార్కెట్ హాలీడే 2021 జాబితాలో మొహర్రం సెలవు దినం ఉంది. ఈ పండుగ సందర్భంగా గురువారం ఆగస్ట్ 19 మార్కెట్లు క్లోజ్ అవుతాయి. ఇక కమోడిటీ సెషన్ కూడా ఉదయం గం.9 నుండి సాయంత్రం గం.5 వరకు ట్రేడింగ్ నిలిపివేస్తారు. సాయంత్రం గం.5 గంటలకు కమోడిటీ మార్కెట్ తిరిగి ఓపెన్ అవుతుంది. ఆగస్ట్ నెలలో స్టాక్ మార్కెట్ సెలవు దినం ఇదే చివరిది. తదుపరి స్టాక్ మార్కెట్ హాలీడే సెప్టెంబర్ 10వ తేదీన ఉంది. ఆ రోజు గణేష్ పర్వదినం సందర్భంగా స్టాక్ మార్కెట్ పని చేయదు. ఆ తర్వాత అక్టోబర్ 15న దసరా పర్వదినం సందర్భంగా సెలవు ఉంటుంది.
బ్యాంకులకు కూడా సెలవు
వివిధ రాష్ట్రాల్లో ఆగస్ట్ 16వ తేదీ నుండి 22వ తేదీ మధ్య బ్యాంకులు ఐదు రోజులు క్లోజ్‌గా ఉంటున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) హాలీడే క్యాలెండర్ ప్రకారం పలు ప్రాంతాల్లో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు మూతబడ్డాయి. బ్యాంకులకు వెళ్ళాలని భావించేవారు ఆర్బీఐ అధికారిక వెబ్ సైట్‌లో క్యాలెండర్‌ను చెక్ చేసుకోవచ్చు. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఆగస్ట్ నెలలో మొత్తం పదిహేను రోజులు బ్యాంకులు తెరుచుకోవడం లేదు. ఇందులో రెండో శనివారం, నాలుగో శనివారం, ఆదివారాలు ఉన్నాయి. ఇతర పండుగల సెలవులు ఆయా రాష్ట్రాలను బట్టి ఉంటుంది.

ఇక, ఆగస్ట్ 16వ తేదీ నుండి 22వ తేదీ మధ్య వరుసగా బ్యాంకులు పని చేయవు. ఆగస్ట్ 16న పార్సీ కొత్త సంవత్సరం సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయలేదు. బెలాపూర్, ముంబై, నాగపూర్ వంటి ప్రాంతాల్లో బ్యాంకులు మూతబడ్డాయి. ఆ తర్వాత ఆగస్ట్ 19వ తేదీన ముహర్రం సందర్భంగా బ్యాంకులు పని చేయడం లేదు. న్యూఢిల్లీ, ముంబై, జైపూర్, అగర్తాల, జమ్ము, అహ్మదాబాద్, బెలాపూర్, భోపాల్, హైదరాబాద్, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, నాగపూర్, పాట్నా, రాయ్‌పూర్, రాంచీ, శ్రీనగర్ ఇలా అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు తెరుచుకోలేదు.
ఆగస్ట్ 20వ తేదీన బెంగళూరు, చెన్నై, కోచ్చి, తిరువనంతపురంలో ఓనం సందర్భంగా బ్యాంకులు మూతబడతాయి. ఆగస్ట్ 21వ తేదీన తిరువోనం సందర్భంగా తిరువనంతపురం, కోచ్చిలలో బ్యాంకులు తెరుచుకోవు. ఆ తర్వాత 22వ తేదీ ఆదివారం. అదే రోజు రక్షా బంధన్ కూడా ఉంది. అంటే పలు ప్రాంతాల్లో వరుసగా నాలుగైదు రోజులు బ్యాంకులు తెరుచుకోవు.


Click it and Unblock the Notifications