Trade Tensions: వజ్రాల వెలుగులుతో దేశ ఆర్థిక వ్యవస్థకు గట్టి ఊపిరినిస్తున్న గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల బారీన చిక్కుకుంది. ప్రపంచ వజ్రాల తయారీకి, పాలిషింగ్ రంగానికి హార్ట్ గా మారిన సౌరాష్ట్ర వజ్రాల జిలుగు మసకబారింది. అమెరికా ఇటీవల పెంచిన సుంకాల రూపంలో ఇక్కడ కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తోంది. ఏప్రిల్‌లో 10 శాతం ఉన్న సుంకాలు, మొదట 25 శాతం కి పెరిగి, ఆగస్టులో ఒక్కసారిగా 50శాతం కి ఎగబాకాయి.
టైమ్స్ కథనం ప్రకారం.. ట్రంప్ సుంకాల ప్రభావంతో ఒక్క సౌరాష్ట్రలోనే దాదాపు లక్ష మంది ఉద్యోగాలు కోల్పోయారు. భావ్‌నగర్, అమ్రేలి, జునాగఢ్ వంటి జిల్లాల వజ్రాల చిన్న యూనిట్లలో తొలగింపులు భారీ ఎత్తున చోటు చేసుకున్నాయి. గుజరాత్ డైమండ్ వర్కర్స్ యూనియన్ ఉపాధ్యక్షుడు భవేష్ ట్యాంక్ మాట్లాడుతూ.. గత పదిరోజుల్లోనే పరిస్థితి తీవ్రమైందన్నారు. US కస్టమర్లు ఆర్డర్లు వాయిదా వేయడం లేదా రద్దు చేయడం వల్ల కటింగ్, పాలిషింగ్ పనులు పూర్తిగా ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ.15 వేల నుంచి 20 వేల రూపాయలు సంపాదించే వేలాది మంది కార్మికులు ఈ టారిఫ్ దెబ్బతో ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డారని తెలిపారు.

సౌరాష్ట్రలో 3 లక్షల నుంచి-4 లక్షల మందికి ఉపాధి ఇచ్చే యూనిట్లు ఇప్పుడు ఆర్డర్లు లేక వెలవెలబోతున్నాయి. ఇప్పటికే US, చైనా మార్కెట్లలో డిమాండ్ మందగమనంతో ఒత్తిడిలో ఉన్నాయి. సుంకాల పెంపు ఆ ఒత్తిడిని మరింతగా పెంచింది. పెద్ద వజ్రాల కంపెనీలు, వాటాదారుల ప్రతిస్పందన భయంతో బహిరంగంగా ఈ సమస్యపై మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. అయినప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం అక్కడ ఘోరంగా తయారైంది.
కొంతమంది ఉద్యోగాలు కోల్పోయిన కూలీలు ప్రయోగశాలలో తయారయ్యే వజ్రాల (Lab-Grown Diamonds - LGD) రంగం వైపు వెళ్తున్నారు. అయితే ఈ LGD రంగం కూడా అమెరికా మార్కెట్‌పై ఆధారపడి ఉండటంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. LGDలపై కూడా 50 శాతం సుంకం పడితే, ఉద్యోగ నష్టాలు మరింత పెరుగుతాయని రత్నాలు & ఆభరణాల ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ (GJEPC) గుజరాత్ చైర్మన్ జయంతిభాయ్ సవాలియా తెలిపారు.
రూ.17 వేల కోట్ల విలువ కలిగిన కిరణ్ జెమ్స్ గ్రూప్ డైరెక్టర్ దినేష్ లఖానీ మాట్లాడుతూ.. సుంకాల తక్షణ ప్రభావం ఉత్పత్తి తగ్గడం, తాత్కాలిక తొలగింపులు, తక్కువ షిఫ్ట్‌లు అని చెబుతున్నారు. ఆర్డర్ వాల్యూమ్‌లు పడిపోతే, ఖర్చు తగ్గించేందుకు మరిన్ని ఉద్యోగాల తొలగింపులు తప్పవని హెచ్చరిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల ఎగుమతిదారుగా ఉంది. అమెరికా, చైనా రెండు ప్రధాన కొనుగోలు దేశాలుగా ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 10 బిలియన్ల డాలర్ల మేర ఉన్నాయి. వాటిలో కట్, పాలిష్ చేసిన వజ్రాలే పెద్ద భాగంగా ఎగుమతి అయ్యాయి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలు ఈ ఆదాయాన్ని గణనీయంగా దెబ్బతీస్తున్నాయి.
ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి వజ్రాల పరిశ్రమ.. కేంద్ర ప్రభుత్వం వద్ద పలు డిమాండ్లు పెడుతోంది. అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చలను వేగవంతం చేయడం, ఎగుమతి ప్రోత్సాహకాలు పెంచడం, వడ్డీ సబ్సిడీలు ఇవ్వడం, GST రీఫండ్‌లను త్వరగా చెల్లించడం వంటి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తోంది. గాలంట్ జ్యువెలరీ ఎండీ అరవింద్ గుప్తా మాట్లాడుతూ..అమెరికా మన ఎగుమతుల్లో 25 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. అధిక సుంకాలు వాల్యూమ్‌లను, మార్జిన్‌లను, వేలాది ఉద్యోగాలను నాశనం చేస్తాయని చెబుతున్నారు.
భారతదేశంలోనే అతిపెద్ద వజ్ర కేంద్రంగా సూరత్ ఉంది. కొన్ని అంతర్జాతీయ కంపెనీల కొనుగోలుదారులు ఇప్పటికే వియత్నాం, థాయిలాండ్‌లలో ప్రత్యామ్నాయ తయారీ కేంద్రాలను వెతకడం ప్రారంభించారని ధని జ్యువెల్స్ MD విజయ్ కుమార్ మంగుకియా చెబుతున్నారు. తక్షణ పరిష్కారం రాకపోతే, అనేక యూనిట్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు. అమెరికా సుంకాల బాదుడుతో సౌరాష్ట్ర వాణిజ్య యుద్ధపు చీకటిలోకి జారిపోతోందని చెప్పవచ్చు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

ఇరాన్ తర్వాత ఈక్వెడార్ మీద గురిపెట్టిన అమెరికా... నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులను ఏరిపారేస్తున్న ట్రంప్ సైన్యం..

Russian oil: ట్రంప్ క్లెయిమ్ VS రియాలిటీ.. రష్యా ఆయిల్ కొనుగోలుపై క్లారిటీ ఇచ్చిన న్యూఢిల్లీ!

Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications