అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొత్త వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. రష్యా నుండి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో "పెద్ద అడుగు" అవుతుందని ఆయన పేర్కొన్నారు.
బుధవారం ఓవల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేయడం పట్ల అమెరికా సంతోషంగా లేదు. ఎందుకంటే ఆ డబ్బు పుతిన్ యుద్ధాన్ని కొనసాగించడానికి ఉపయోగపడుతోందని వ్యాఖ్యానించారు. మోదీ నా స్నేహితుడు, భారత్ ఇకపై రష్యా నుండి చమురు కొనదని నాకు స్పష్టంగా చెప్పారు. ఇది గొప్ప ముందడుగని ఆయన అన్నారు.
అలాగే ఇప్పుడు మనం చైనాను కూడా ఇదే దిశగా ఒప్పించాలి. భారత్ ఈ నిర్ణయం తీసుకోవడం రష్యాపై ఒత్తిడి పెంచుతుంది. ఈ యుద్ధం ముగియడానికి ఇది సహాయకారి అవుతుందని Trump అన్నారు. సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ రీసెర్చ్ (CREA) ప్రకారం.. చైనా తర్వాత రష్యా శిలాజ ఇంధనాలను కొనుగోలు చేసే రెండవ అతిపెద్ద దేశం భారత్‌నే అని ఆయన గుర్తు చేశారు.

మోదీని "గొప్ప నాయకుడు"గా వర్ణిస్తూ ట్రంప్.. ఆయన నన్ను ప్రేమిస్తారు, కానీ నేను చెప్పిన 'ప్రేమ' అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. ఆయన రాజకీయ జీవితానికి హాని కలిగించకూడదని కోరుకుంటున్నాను" అని అన్నారు.
భారత్‌లో చాలా సంవత్సరాలుగా నాయకులు మారుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మోదీ లాంటి శక్తివంతమైన నాయకుడు ఉండటం ఒక అదృష్టం. రష్యా నుండి చమురు కొనుగోలు ఆగిపోతుంది. ఇది ఒక ప్రక్రియ. వెంటనే జరగదు కానీ ఇప్పటికే ప్రారంభమైందని ట్రంప్ అన్నారు. భారత ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లుగా తెలిపారు. భారత్ రష్యా నుండి చమురు కొనకపోతే, రష్యాపై ఒత్తిడి పెరుగుతుంది. యుద్ధం ముగిసిన తర్వాత భారత్ మాస్కోతో మళ్లీ వాణిజ్య సంబంధాలు పునరుద్ధరిస్తుందని మోదీ చెప్పారని ట్రంప్ తెలిపారు. ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికపై భారత్-అమెరికా-రష్యా సంబంధాలపై కొత్త చర్చలు రేపాయి.
ట్రంప్ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కఠిన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ట్రంప్‌కు భయపడుతున్నారు. భారత్ రష్యా చమురును కొనుగోలు చేయదని ట్రంప్ ప్రకటిస్తున్నారు. మోదీ మాత్రం మౌనంగా చూస్తున్నారని రాహుల్ ఎక్స్ (మాజీ ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.పదే పదే తిరస్కరణలు ఎదురైనా మోదీ అమెరికా అధ్యక్షుడిని సంతోషపరచే ప్రయత్నమే చేస్తున్నారు. ఆర్థిక మంత్రి అమెరికా పర్యటనను రద్దు చేయడం, షర్మ్ ఎల్ షేక్ సమావేశానికి హాజరుకాకపోవడం ఇందులో భాగమేనని రాహుల్ గాంధీ తెలిపారు.
ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతిదారైన భారతదేశం, ఉక్రెయిన్‌పై రష్యా దాడి (ఫిబ్రవరి 2022) తర్వాత రష్యా నుండి చమురు కొనుగోళ్లు భారీగా పెంచింది. పాశ్చాత్య ఆంక్షలు, యూరప్‌లో తగ్గిన డిమాండ్ కారణంగా రష్యా చమురు చౌకగా అందుబాటులోకి రావడంతో భారత్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది. రష్యా చమురు వాటా భారత దిగుమతుల్లో 1% నుండి దాదాపు 40% వరకు పెరిగింది. అయితే భారత్ ఎప్పటిలాగే తన చమురు కొనుగోలు జాతీయ ఇంధన భద్రత, ఆర్థిక ప్రయోజనాల ఆధారంగా జరుగుతుందని పేర్కొంటూ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తటస్థ వైఖరిని కొనసాగిస్తోంది.
ఏదేమైనా ట్రంప్ వ్యాఖ్యలు భారత విదేశాంగ విధానం, రష్యా సంబంధాలు, అమెరికా ఒత్తిడి మధ్య ఉన్న సున్నిత సమతుల్యాన్ని మళ్లీ చర్చనీయాంశం చేశాయి. మోదీ నిజంగా ఈ హామీ ఇచ్చారా అనే విషయం అధికారికంగా స్పష్టత రాకపోయినా, ట్రంప్ వ్యాఖ్యలతో భారత్ అంతర్జాతీయ దృష్టిలో మరోసారి ప్రధాన చర్చా కేంద్రంగా మారింది.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications